నీవు తోడుంటావని

నీవు తోడుంటావని
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: సుజాత కోకిల

నిన్ను నవమాసాలు మోసి కన్నాను.
నిన్ను చూసి ఎంతో మురిసిపోయాను.
మళ్లీ నాలో కొత్త ఆశలు చిగురించాయి.
నీవు నాకు తోడుంటామని ముందు,
అడుగు వేశాను. నేను కన్న కలలు,
నెరవేర్చుకోవాలని ఎన్నో కలలు కన్నాను.
నీవు ఎంతో ఉన్నత శిఖరాల్లో ఉండాలని,
కోరుకుంటూ నీకై అహర్నిశలు కష్టపడ్డాను.
దూరపు కొండలను చూసి మురిసిపోయావు.
పుట్టిన ఊరును కన్న తల్లిని విడిచి దూరంగా
వెళ్లి ఏదో సాధించాలని అనుకున్నావు
ఏదీ సాధించకపోగా కష్టాల్లో పడిపోయావు
నీవు కానరాక నేనెంతో హైరానా పడితిని
ఏడను వేతుకను ఎవరికనీ చెప్పను నా కొడకా
పిల్లలను కనడం తప్ప కలలు కనడం తప్ప
ఆశలతో బ్రతకడం తప్ప ఆ తప్పు ఎవరిది
కొడుక మా బాధలు ఎవరితో చెప్పుకోము

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!