మౌనమే నవ్వితే

మౌనమే నవ్వితే
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: సత్య కామఋషి

మౌనం అట నవ్వితే.,
ఏ లెక్కకు  చిక్కని,
అరచేతికి దక్కని,
ఏ కనులూ గాంచని.,

ఏ మంచి ముత్యాలు
ఇట జాలువారునో..!

నిస్తేజపు చీకట్లు నిండిన
ఏ మనుసుల వాకిట్లో..
ఆనందపు వెన్నెలల
కళ్లాపి చల్లునో..!

నిండు పున్నమి పొద్ధుల,
వెండి వెలుగునద్దునో..!

తరగని నవ్వు ఫువ్వుల..
సప్తవర్ణ  సుమసోయగాల.,
రంగవల్లులను దిద్దునో..!

నిరాశ నిండీ  ఒరవడి తగ్గిన
ఏ ఎండమావి గుండె గూటిలో..
ఆశల మరీచీకలు పూయించి,
ఆనందభాష్ప జలధారలనే,
చెక్కిలిపై చెరగని సంతకాల
తీపి గురుతులుగా జాలువార్చునో..!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!