కనిపించని నీడ రెండు విధాలుగా

కనిపించని నీడ రెండు విధాలుగా
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన -ఎం. వి. ఉమాదేవి

  ఒకరోజు కమల ఆడపడుచు కూతురు పెళ్లికి కడపకు వెళ్ళింది బంధువులతో కలిసి. ఇంట్లో సుజి, రాజీ వాళ్ళ నాన్న మాత్రమే ఉన్నారు. ఆ వీధిలో అందరు చిన్న చిన్న పనులు చేసుకొని జీవనం గడిపే వాళ్ళు. సుజీ వాళ్ళ నాన్న గారు గవర్నమెంట్ ఉద్యోగి. పక్కన ఉన్నవాళ్ళు తరచూ కమల వాళ్ళ ఇంటికి వచ్చి, ఏదో సలహాలు మంచి రోజూ చెప్పమ్మా అంటూ అడుగుతా ఉంటారు. ఉద్యోగస్తుని భార్య అయినా గర్వం లేని కమల వాళ్ళతో స్నేహం గా మాట్లాడటం, సాయం చేయడంతో సంతోషం పొందుతుంది. ఇంకో ప్రక్కన ఇళ్ల లో ఇద్దరు ఉద్యోగస్థుల ఇళ్ళున్నాయి. రజనీ, సత్యవతి వాళ్ళు కూడా కమలతో సావాసం గానే ఉంటారు. కానీ లోలోపల కొంచం అసూయ ఉంది.  ఊరు వెళ్లేముందు పిల్లలకి జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది కమల. కొడుకు వేరే జిల్లా లో చదువుకుంటూ ఉన్నాడు. నాలుగిళ్ళ అవతల సుందరమ్మ మనవరాలు పెళ్లి అని నలుగుకు పిల్చారు రాజీ, సుజీని. టీనేజ్ పిల్లలు కదా తయారై ఉత్సాహం గా వెళ్లారు. అక్కడ అమ్మాయి ప్రక్కన ఎవరిని కూర్చో బెట్టాలి అని తెల్లగా పాలబుగ్గలు తో ఉన్న  సుజీ ని ఎంపిక చేసారు. తను సిగ్గు పడుతూనే కూర్చొని నలుగు పెట్టించుకుంది. రజనీకి అసూయతో మనసు భగ్గుమంది. తన కూతుళ్లు ముగ్గురు ఏమి బాగుండరు. ఆలోచిస్తూ తాంబూలం తీసుకొని పోయింది. ఇంటికి వచ్చిన సుజికి రాజీ తలంటు పోసింది. కాసేపటికి వచ్చిన రజిని, “అయ్యో. తలకు పోసావా రాజీ. అన్నలు ఉండే వాళ్ళు గురువారం తల స్నానం చెయ్యకూడదు తెలుసా? అన్న కు చెడు జరుగుతుంది. “అనేసి పోయింది. పిల్లలకు వేడుకలు చూసిన సంతోషం ఆవిరి అయింది. మనసు లో భయం నీడలు మర్రి ఊడల్లా పరచుకుని. ఇద్దరు కలిసి ఏడవడం మొదలెట్టారు. అమ్మ కూడా ఊరు పోయింది కదా! నాన్న గారు ఆఫీస్ కు పోయారు. సాయంత్రమే వచ్చేది. కాసేపు అయ్యాక వీధిలో రిక్షా బండి లాగే శివయ్య భార్య వచ్చింది. అమ్మాయి కాసిని మజ్జిగ పొయ్యమ్మ అని. మజ్జిగ ఇస్తున్నపుడు చూసి ఎందుకు ఏడుస్తూ ఉన్నారని వాకబు చేసేసరికి విషయం చెప్పింది రాజీ. “ఓసి పిచ్చి పిల్లల్లారా. పండుగలు, పెళ్లి, పేరంటాలలో వారాలు పట్టింపు అస్సలు లేదు. ఏ వారం అయినా దోషమే ఉండదు. మీరు ఎందుకు భయపడ్డారు.? నమ్మ కంటే ముప్పై ఏళ్ళు పెద్దదాన్ని నేను. చెప్పా కదా? హాయిగా అన్నంతినండి.! అనేసి పోయింది శివయ్య భార్య. తెప్పరిల్లిన అక్క చెల్లెళ్ళు, అమ్మ వచ్చాక జరిగింది చెప్పారు. సమాజం ఎంత క్రూరమైనది. తనతో స్నేహంగా ఉండికూడా చిన్న విషయం లో తనపిల్లలని భయం, బాధకు గురిచేసిన రజిని లో కనిపించని ఇలాంటి తోడేలు నీడ ఉంది. చదువు సంధ్యా లేని శివయ్య భార్యకు మనసు వెన్నెల నీడ. అనుకున్నది కమల.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!