విశ్వరూప సందర్శన యోగం

విశ్వరూప సందర్శన యోగం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ముద్దు వెంకటలక్ష్మి

పంచభూతాల గతానుగతగమనాలు పంచేంద్రియాల దివ్యానుభవాలు,
ఊహాచిత్రాల సుందర విహారాలు
లోకానుభవ సాక్షాత్కారాలు
సామాజిక సత్యాల ఘోషణలు, ధర్మాధర్మాల విశ్లేషణలు,
జీవన రహదారుల ఎత్తుపల్లాలు,
జీవితాల లోని ఒడిదుడుకులు ,
కుటుంబ సంబంధాల ఊగిసలాటలు
ప్రపంచ సంఘటనల సంవేదనలు,
లలితకళలూ వ్యవహార కళల
వివిధ లయగతులు,
నవరసభావాల వెల్లువలు ,
పిపీలికాది బ్రహ్మ పర్యంత వర్ణనలు
నానా విధ అలంకారాలు,
అక్షరాల చిత్రవిచిత్ర విన్యాసాలు,
మనోహర పద విన్యాసాలు,
నిత్యస్మరణీయ ఉల్లేఖనాలు
సాహిత్య సమూహాల్లో
కవుల కలాల నుండి నిత్యం
సందోహంగా సముద్భవిస్తున్న
సంపూర్ణ తెలుగు కవిత్వం
విశ్వరూప సందర్శన యోగం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!