మాఊరు కావలి

మాఊరు కావలి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన – ఎం. వి. ఉమాదేవి

ప్రియమైన మా ఊరు కావలి!
కవనానికి, శౌర్యానికి కూడలి!
మనుమసిద్ధి రాజ్యానికి
ఆనాటి సైనికస్థావరం కావలి !
కవి తిక్కన పాండిత్యశోభ
పెన్నానది పరవళ్లు
ఉదయగిరి కోట అందం
పైరు పంటల పచ్చధనం
సముద్ర స్నానం సరదాలు!
దీపాల పిచ్చయ్య శాస్త్రిగారి
దివ్య కవన శిల్పం
ఇంద్రగంటి కవిత్వం తో
ఈ నేల పవిత్రము!
ఎస్. వి. భుజంగరాయశర్మ
గారి తిరిగే రంగుల రాట్నం !
ఇంతేరా ఈ జీవితమ్ !
చెట్టిగారు శ్రేష్టి యై, గుప్తాలు
వ్యాపార వ్యవస్థ ప్రముఖమై
వెలుగులో నిలిచినదే కావలి
ప్రజాసేవలో సైతం నిలిచిరి!
రాజకీయ చైతన్యము, లాయర్లు,
డాక్టర్లు,విశ్వోదయ
విద్యాసేవ, జవహర్ భారతికాలేజి
కావలికే మణిమకుటం!
కావలి చెరువు కల్పవల్లి
వరిపంటలు సిరులొలుకు
గ్రామశక్తి శ్రీ కళుగోళ శాంభవి!
పోలేరమ్మ, గంగమ్మలు
పురాతన ఆలయాలు
రుద్రపాద క్షేత్రము, కోనేరుతో
వెలసిన శ్రీదుర్గాభ్రమరాంబ
సమేత మల్లికార్జున స్వామి !
బిజిలీ బజారుకు రక్షణ
శ్రీ లక్ష్మీకాoత స్వామి యే !
గీతా మందిరములో
చిరునవ్వుల శ్రీకృష్ణా!
సాయి, విఘ్నేశుల కరుణ
వస్త్ర వ్యాపారము విలసిల్లు
మూడు తానులు,ఆరు బేరాలై!
ఆధునిక ఆసుపత్రులు
ఇంజనీరింగ్ కళాశాల
కవులకు సన్మానాలు
షాదీ మంజిళ్లు, కళ్యాణ
మండపాలు, సుందరమైన పార్కులు !
పరిసర గ్రామ ప్రజలతో
యెడతెగని సందళ్ళు!
ఇలా ఇలా వెలగాలి వెయ్యేళ్లు!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!