పల్లె సిగలో పచ్చని ఉత్సవం

పల్లె సిగలో పచ్చని ఉత్సవం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఎన్. లహరి

మట్టి పరిమళాలు
ఎదను తడుపుతుంటే
తొలకరి నాట్యంలో
పల్లె పండుగ చేసుకుంది,
ప్రకృతి పలకరించింది,
పల్లె పులకరించింది,
పసి పుష్పాల పరిమళాన్ని చూసి,
పుడమి పరవశించింది,
జోడెడ్ల బండిపై,
జోరైన బాల్యాన్ని చూసి,
అడవి తల్లి మురిసింది,
తరువు మోము మెరిసింది,
చెమట చిందించే మనుషులు
కలిసిమెలిసి ఉండే కుటుంబాలు
అందమైన మనసులు
స్వచ్ఛమైన ఇరుగుపొరుగు ప్రేమలు
పల్లెకు పండగొచ్చింది..
పల్లె పడుచు అందాలు.
చూడముచ్చటైన పరువాలు
అనురాగం, ఆప్యాయత అల్లుకున్న పందిరే..
ఊరు ఊరంతా హుషారుకు మారుపేరు..
పైరగాలుల హొయలు.
పల్లెలు ప్రగతికి పట్టు కొమ్మలు..
ఎన్నో మధురానుభూతుల సమాహారాలు,
అంబరాన్నంటే ఆనందాలు..
అందుకే, పల్లెకు పండగొచ్చింది…
ప్రకృతి పలకరించింది,
పల్లె పులకరించింది,
పసి పుష్పాల పరిమళాన్ని చూసి,
పుడమి పరవశించింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!