(అంశం :: “విమర్శించుట తగునా”)
ఏల ఆ విమర్శ
రచన::విజయ మలవతు
బ్రతుకు పుస్తకంలో ఇష్టమైన పేజీలను గుర్తుంచుకొని
బాధాకరమైనవి మరుగు పరుస్తాం ..
అలాగే విమర్శలకు ఇచ్చే సమయం ..
ఆత్మ విమర్శకు కేటాయిస్తే
మనిషిగా ఒక అర్ధవంతమైన జీవనం సాధ్యమేగా…
బాధ కష్టం కనిపించకుండా దాచినా
మనుషులేనా ..మానులే నయం…
ఇంత బాధలోను ఎలా నవ్వగలుగుతున్నారో..
బాధలే అంత ధైర్యాన్ని నేర్పాఏమోనని ఎందుకనుకోరో..
అంత ఆస్తి ఉంది ఏమి లాభం
అనుభవించడం తెలియదు ..
అలా ఉండటం వల్లే ఆస్తి కూడబెట్టారు
అనే విషయం మరుపు వల్లనా ఆ విమర్శ..
ఇలాంటి బిడ్డ అవసరమా
ఇలాంటి వాళ్లకు ఎందుకు ఆయుష్షు ఇస్తాడో ఆ దేవుడు..
ఆ బిడ్డను భరించే తల్లికి లేని బాధ అందరికి ఎందుకో…
తగునా ఆ విమర్శ ..
అవసరానికి మాట, చేతి సాయం కోరినా,కోరకున్నా …
అభినందించినా లేకున్నా ఓ విమర్శ ..
అన్ని కాలాలు సుఖమే కావాలనుకోవటం ఎంత అత్యాశో…
విమర్శ ఎదుర్కోకుండా , విమర్శించకుండా
జీవన ప్రవాహం దాటటం అసాధ్యం..