ఒక్కసారి ఆలోచించు

(అంశం :: “విమర్శించుట తగునా”)

ఒక్కసారి ఆలోచించు 

రచన::క్రాంతి కుమార్(ఇత్నార్క్)

మందు చుక్కలలో
బాధను మరిపించే కిక్కు ఉందని
జీవితాలను వీధుల్లో పడేసే మత్తే కావాలంటావా ?

సిగరెట్ పొగలో
ఒత్తిడిని తగ్గించే ఔషధం ఉందని
నీవు పెంచుకున్న బంధాలను వదులుకుంటావా ?

మత్తు పదార్థాలలో
శక్తిని ప్రసాదించే అమృతం ఉందని
నిన్ను ఒంటరిని చేసే నిషాను నరాల్లోకి ఎక్కిస్తావా ?

అక్రమ సంబంధాలలో
మనసును ఊహల్లో ఎగిరే స్వేచ్ఛను ఇస్తుందని
ప్రాణాలను బలి తీసుకునే సుఖాలను కోరుకుంటావా ?

విమర్శించడం లో
నీ హృదయంలో మానసిక ఆనందం కలుగుతుందని
ఎదుటి వాళ్ళను కృంగదీసే రాక్షసానందాన్ని పొందాలనుకుంటావా ?

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!