(అంశం :: “విమర్శించుట తగునా”)
పూర్ణిమ చిరుజల్లు లు
రచన::నారుమంచి వాణి ప్రభాకరి

పూర్ణిమ నాడు ఆకాశం మేఘాలలో నిండి వర్షానికి
స్వాగతం పలికి తే ఉరుముల
మంగళ వాయిద్యాలు మెరుపుల విద్యుత్ దీపాల
తోరణాలు ఆకాశానికి అందాన్ని
మరింత ఇస్తే చల్లని .తెల్లని మెరిసే ముత్యాల జల్లులు
చినుకు చినుకు అపురూపంగా
భూదేవిని తాకుతూ పరవశం అందిస్తుంటే భూమాత నక్షత్రాల్లా చేరిన చినుకును
ఆప్యాయంగా తనలోకి స్వాగతించి ఆ పరవశంలో
కొత్త నారును విత్తుల్ని ఎంతో
బాగా ఎదిగి మంచి ఆహారం మానవులకు ఇవ్వాలని ఆనంద పడుతూ పచ్చని పొలాలతో పసిడి పంటలు
అందించి రైతన్నకు అనందం కల్గించి ఆరోగ్య ధాన్యాలను
అందిస్తూ ఎంతో సంబర పడి
ఈ పూర్ణిమ చిరు జల్లులకు
మురిసి ముచ్చట పడిన మోహనాంగి మన భూ మాత
అందుకే ఈ ఏరువాక పూర్ణిమ
ఎద్దులకు రైతులకు పంట పొలాలకు అందరికీ ఆనందము
