(అంశం :: “విమర్శించుట తగునా”)
విమర్శ ఒక సద్విమర్శ..
రచన::వి. కృష్ణవేణి
విమర్శ తగునా అంటే
విమర్శ తగును
విమర్శ లేని జీవితంలేదు.
ప్రతి పనిలో విమర్శ నిమిడీకృతం
మంచి చెడుల మధ్య విమర్శ సహజం
లేనిదానిని ఉన్నదానిగా ఒప్పుకోవడంకంటే
ఉన్నదేదిగా వివరణ అడగడమే మిన్న..
తప్పోప్పులమధ్య విమర్శ తప్పని సరి,,
ఎదుటివారి తప్పులలో విమర్శించ్చేముందు
తనకు తాను ఆత్మవిమర్శ చేసుకుంటూ….
విమర్శ, సద్విమర్శకు మధ్య తావు ఇవ్వడం
ఒక ఉత్తమం.
విమర్శ తప్పును సరిదిద్దుకునేలా ఉండాలి గాని
భిన్నభిప్రాయాలు ఏర్పడేవిధంగా ఉండరాదు.
విమర్శ జరిగే పనికి ఒక అనుభవం.
విమర్శ ఒక సలహా.
విమర్శ సద్విమర్షలమధ్య సాగేదే జీవితం.