ఎన్నో..ఎన్నెన్నో..నీ.. నాలో
రచయిత :: జయకుమారి
ఎన్నో ఆశలు, ఎన్నో ఊసులు.!!
ఎన్నో పులకింతలు, ఎన్నో తలపులు.!!
నీతో పంచుకోవాలని.!!
భారం దించుకోవాలని ఉంటుంది.!!
కానీ.!!
ఆశలన్నీ నిను చూడగానే .!!
నీ చిరునవ్వు తో జతకట్టి !!
నను ఒంటరిని చేసి నీకు తోడై!! నిలిచిపోతాయి.!!
నాలో ఊసులన్ని.!!
నీ నయనాల మెరుపై.!!
నాలో మైమరుపు నింపి.!!
ఊసులన్నీ ఊహల్లో విహరిస్తాయి.!!
కలతలన్ని నీ కౌగిలిలో ఒదిగి.!!
ఆవిరై మౌనమై నాలోనే గూడుకట్టి.!!
పెదవి గడప దాటి రాలేక.!!
నీ ప్రేమ ఉంటే చాలు తుది శ్వాస వరకు.!!
ఎన్ని సుడిగుండాలు ఎదురైనా.!!
ఎదురీత కు ఎద సిద్ధం అంటున్నది.!!
ప్రాణ బంధమా.!!
థాంక్యూ సో మచ్ దీపు గారు
ప్రేమ గురించి చాలా గొప్పగా చెప్పారు
చాలా బాగుంది జయ గారు 👌🏻