స్నేహితుడు

స్నేహితుడు

రచన: చెరుకు శైలజ

రమేష్ సాగర్ ఇద్దరు ప్రాణ స్నేహితులు. కొంత కాలం ఇద్దరు కలిసి ఒకే కంపెనీలో పనిచేశారు. రమేష్ ఆ కంపెనీ నుండి మారి, ఎన్నో రకాల జాబ్స్ చేశాడు. సాగర్ రమేష్తో అనేవాడు ఎప్పటికి జాబ్ మార్చడం మంచిది కాదు .దేనిలోనైన నిలకడ వుండాలి. నువ్వు చెప్పింది నిజమే, ఒకదానిలో వుంటే ఎదుగు వుండదని చెప్పేవాడు. దేనిలో స్థిమితం లేకుండా జాబ్లు మారడం, కుటుంబ లో కలతలు , పిల్లలు వాళ్ళ చదువులు అన్ని చక్కదిద్దడం కష్టం అయ్యేది.
సాగర్ కంపెనీ నుండి అమెరికా వెళ్లాడు. తను జాబ్లో తాను కష్టపడి పైకి ఎదిగిపోయాడు. రమేష్ నాతో వుంటే బాగుండు అని చాలా సార్లు అనుకున్నాడు.
రమేష్ మాత్రం అన్ని వ్యసనాలకు అలవాటు అయ్యాడు. సంపాదించిన డబ్బు వాటికే సరిపోయేది. దానితో ఆరోగ్యం కూడా పాడైపోయింది. ఒకరోజు సాగర్కి ఫోను చేశాడు.
హాలో సాగర్, రమేష్ మాటల్లో సాగర్కి ఏదో తేడా కనిపించింది.తాగావా, అని అడిగాడు.జాబ్ పోయింది. నువ్వు ఇలా తాగుతు అన్ని జాబ్స్ మారుతు వుంటే, పోక ఏమౌతుంది.ఒరేయ్ నా ఆరోగ్యం కూడా బాగాలేదు అన్నాడు. హాస్పటల్లో జైన్ అయ్యాను.నా కేమి అర్ధం కావడం లేదు. నిన్ను ఒకసారి చూడాలని వుంది అన్నాడు. బాధ పడకు నేను ఈ వారమే వస్తున్నాను. వచ్చాక నిన్ను కలుస్తాను. అంతా వరకు ధైర్యంగా వుండు.
సాగర్ హాస్పిటల్ వెళ్ళాడు. ఐసియులో ఫ్రెండ్ని కలిశాడు .రమెష్ని చూసి ఒకసారి తట్టుకోలేక పోయాడు. చిక్కిసగమైనాడు. ఒరేయ్! నేను బతుకను. చివరి క్షణాన నిన్ను చూశాను. అంతే చాలు.
అప్పుడు నీ మాటలు విని వింటే, నేను కూడా నీలా వుండేవాడిని. నన్ను క్షమించు రా అన్నాడు .ఏం కాదు. ధైర్యం గా వుండు. నేను డాక్టర్ కలిసి వస్తాను. అని చెప్పి సాగర్ డాక్టర్ దగ్గరకు వెళ్ళి, ఏమైంది డాక్టర్ అన్నాడు. కిడ్ని పాడైంది.ఎవరైనా ఒక కిడ్నీ డోనేట్ చేసేవాళ్ళు వుంటే, ఆయన ప్రాణానికి ఏం అపాయం లేదు.
సరే డాక్టర్ నేను ఇస్తాను. కిడ్నీ నాది ఒకసారి చెక్ చేయండి అన్నాడు. సాగర్ కిడ్నీ రమేష్కి సరీపోయింది. రమేష్ ఆరోగ్యం కుదుటపడింది. డాక్టర్ నాకు కిడ్నీ దానం చేసిన ఆ దాత ఎవరో నేను తెలుసు కోవచ్చా అన్నాడు .
మీ మిత్రుడు సాగర్ అవునా ! తను నాకు కిడ్నీ దానం చేసింది సాగరా?డాక్టర్ ఎక్కడ వున్నాడు.నేను వెళ్లి కలుసోకోవాలి ఆన్నాడు వుండండి ,అతనే వస్తున్నాడు .
.ఏమిటిరా రమేష్ ఇప్పుడు ఎలా వుంది? నీలాంటి ఫ్రెండు వుంటే నాకు ఏమౌతుందిరా! చచ్చి కూడా బ్రతుకుతాను.నీవు ఏమిటిరా ? నాకు కిడ్నీ దానం చేశావు.” నా అన్న వాళ్ళె మానకేమిటి అని పట్టించుకో కుండా “వుంటున్నా, ఈ రోజుల్లో అదేరా స్నేహం అంటే, మనిషికి, ఒక కిడ్నీ వుండే చాలు. నా కిడ్నీ నీకు ఇచ్చాను. అప్పుడూ నీవు కూడా నాలాగే ఆరోగ్యం గా వుంటావు కదా! రమేష్ మంచం మీద లేచి కూర్చుని సాగర్ రెండు చేతులు పట్టుకోని, నాకు ఇలాంటి ఫ్రెండ్ దొరికినందుకు ఆ దేవునికి చాలా థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇప్పటి నుండి నీవు చెప్పినట్లు ఒకే జాబ్ లో వుంటాను. ఆ జాబ్ కూడా నేనే ఇస్తాను.నా కంపెనీలో నువ్వే నా మేనేజర్వి రమేష్ మంచం దిగి ఆనందభాష్పాలతో సాగరాన్ని కౌగిలించుకున్నాడు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!