భక్తునిబాధ

(అంశం: “ఏడ తానున్నాడో”)

భక్తునిబాధ

రచన: యాంబాకం

వెతికితిని వైకుంఠము లో
శ్రీ మహావిష్ణువు ని కనులార చూడగనే కానరాడే!

వెతికితిని క్షేత్రములు శ్రీ విష్ణు మూర్తి ని కనులార చూడగ కానరాడే!

వెతికితిని అయోధ్య లోన శ్రీ నారాయణ స్వామి ని కనులార చూడగ కానరాడే!

వెతికితిని ఏడుకొండలలో
శ్రీనివాసుడ ని కనులార చూడుగ కానరాడే

వెతికితిని భద్రాచలం లోన శ్రీరామచంద్రమూర్తి ని కనులార చూడగ కానరాడే!

వెతికితిని  ముళ్ళోకము లోన హరిని కనులార చూడగ కానరాడే!

వెతికితిని క్షీర సాగరముడని శ్రీ ని కనులార చూడగ కానరాడే!

వెతికితిని సహస్ర నామములు విబడిన చోటునంత కనులార చూడగ కానరాడే!

వెతికితిని గరుడవాహనుడని ఇటు కాంచగ కనులార చూడగ కానరాడే!

వెతికితిని ఉనికి రేపల్లె లోన తెలియగా గోపాలుడు ను కనులార చూడగ కానరాడే!

వెతికితిని మునుల తపస్సు ల పఠణం లో ని మంత్ర జపములోని భక్తివత్సలుని చూడగ కానరాడే!

వెతికి వెతికి అలసినవాడినై శ్రీ లక్ష్మికి మ్రోక్కుకోంటిని ఆపధబాంధవుడు ఆనాధ రక్షకుడు “ఏడతానున్నాడో”తలుపుమని

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!