అజాత శత్రువు – వాజ్ పాయ్

అజాత శత్రువు – వాజ్ పాయ్

ఆయ్యలసోమయాజుల ప్రసాద్

భారతరాజకీయ చరిత్రలోమచ్చలేని, మరపురాని, నిష్కళంక ,నిరూపమాన దేశభక్తులు  వాజ్ పాయ్
అకుంఠిత దీక్షతో అసమాన ప్రతిభ తో సమాజ హితమే నా హితమని తలచి ఆజన్మ బ్రహ్మచారి గా సేవలందించిన మీరు మా పాలిట మణిరత్నమే
అందుకోండి మీకివే మా శతకోటి భారతీయుల వందనములు………!!

దేశ పదవ ప్రధాని గా మీరు వచ్చి మెరుచేసిన అనేక బృహత్కార్యాలు భావితరాలకు స్ఫూర్తి.
ప్రోక్రాన్  అణుపరీక్షతో భరతమాత కీర్తిని ఖండాంతరాలకు వ్యాపింపచేసిన మీరు
మా పాలిట దైవానివే అందుకోండి మీకివే మా శతకోటి భారతీయుల వందనములు……!!

ఇంతితై వటుడింతై అన్న విధంగా ప్రతిపక్షనేతగా లోకసభలో, ప్రవేశించి మొదటి కాగ్రెసేతర మురార్జీ మంత్రివర్గం లో విదేశాంగ మంత్రిగా అత్యద్భుతంగా పనిచేసి అందరిమన్ననలను పొందిన మీరు కర్తవ్యపరాయణ కు ప్రతీక
ప్రధాన మంత్రిగా రహదారుల విస్తరణకు భావితారాలకి ఆదర్శం
స్త్రీ సంక్షేమం, అనాధపిల్లల  సంరక్షణ  వంటి ఎన్నోపథకాలకు మీరే భావిరాలకి ఆదర్శం
మీ వాక్పటిమ మరియు కవిహృదయం  వసుదైవ కుటుంబానీకె ఆదర్శం అందుకే మీరు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లు
అజాత శత్రువులే
దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నకే వన్నెతెచ్చిన
మీకివే శతకోటి భారతీయుల వందనములు…….!!
(భారతరత్న అటల్ బిహారి వాజ్ పాయ్ గారికి నివాళులు అర్పిస్తు)

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!