కదం తొక్కిన కలం

కదం తొక్కిన కలం(కాళోజీ వర్ధంతి సందర్భంగా)

రచన: ఐశ్వర్య రెడ్డి

నిజాం నిరంకుశత్వ పాలన ముగింపు కోసం  బడుగు జీవుల భుక్తి కోసం
కదం తొక్కింది కాళోజీ కలం //

తెలంగాణ దాస్య శృంఖలాలు తెంచడం కోసం నైజాం పాలన కు ఎదురునిలిచి
కదం తొక్కింది కాళోజీ కలం  //

ప్రజల గోడును ప్రపంచానికి తెలియడం కోసం ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక అంటూ కదం తొక్కింది కాళోజి కలం//

బానిస బ్రతుకుల విముక్తి కోసం
నవ తెలంగాణ నిర్మించడం కోసం
కదం తొక్కింది కాళోజీ కలం //

అక్షరమే ఆయుధమై ప్రజా ఉద్యమానికి ఊతమై,
రజాకార్లపై ఎక్కుపెట్టిన బాణంలా
కదం తొక్కింది కాళోజి కలం//

అన్యాయాన్ని ఎదిరించడం కోసం
సమాజ శ్రేయస్సు కోసం
కదం తొక్కింది కాళోజి కలం //

తెలంగాణ నవ కవులకు మార్గమై
యువతకు గమ్యమై ,తెలంగాణ భాషకు యాసకు వన్నె తెచ్చి
కదం తొక్కింది కాళోజి కలం//

రాతలనే తూటాలతో ప్రశ్నించిన ప్రజా కవి కలం , గోంతేత్తిన పద్మవిభూషణుడి గళం
దేశానికి అంకితం అన్న మహోన్నతుని జీవితం //

You May Also Like

One thought on “కదం తొక్కిన కలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!