జీవన పోరాటం

జీవన పోరాటం

రచన: శ్రీదేవీ విన్నకోట

నాలో ఏమైనా సాధించగలను అనే చిన్న ఆశ.
అ అంశాన్ని కానివ్వను ఎల్లప్పుడూ నిరాశ.

నాకు నేను నిర్దేశించుకున్న ఒక ఉన్నత లక్ష్యం.
కానివ్వను ఎప్పుడూ అలక్ష్యమైన నిర్లక్ష్యం

ప్రతిరోజు కొత్త ప్రత్యూష తుషార ఉదయం.
నా విజయాలకి మొదలవుతుంది శుభోదయం.

సృష్టిలో ప్రాణం ఉన్న ప్రతి జీవం వైవిధ్యమైన అందం
లోకంలో అందరి సంతోషమే నాకు ఆనందం.
అందరితో నా ఆనందమే నాకు మహదానందం.

జీవనం పోరాటం మనిషికి ప్రతిరోజూ ఒక సమరం
కరిగిపోయిన కాలం విలువ అపూర్వం.
రాబోయే క్షణాల్లో మన జీవితం అమూల్యం.
మనం జీవిస్తున్న మనిషి జన్మే ఎప్పటికీ అద్వితీయం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!