మనసులోనే నిలిచిన ప్రేమ

(అంశం :: మనసులు దాటని ప్రేమ)

మనసులోనే నిలిచిన ప్రేమ

రచయిత్రి :: బొడ్డు హారిక (కోమలి)

ప్రేమ అనే రెండక్షరాల పదం జీవితం అనే మూడక్షరాల పదంతో ఎప్పుడు ముడిపడే ఉంటుంది, అది మొదట తల్లిదండ్రులు ప్రేమగా మొదలై, అక్కాచెల్లెళ్ళు, అన్నదమ్ముల ప్రేమ తో పయనించి , ప్రియుడు లేదా ప్రేయసి ప్రేమ లో ప్రవేశించి పరిణయ బంధమై పతి లేదా సతి ప్రేమ గా పయనం సాగిస్తుంది, కొందరికి ప్రియుడు పతి కాలేక , ప్రేయసి సతి కాలేక, కాలమే కాలకూటమయినట్లు మారిపోపోవును. కాలకూటమైన కాలంతో ప్రతి క్షణం కాపురం చేసే ఓ కాంత కథ ఇది………….

దేవికది ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడే మనస్తత్వం కాదు, తను బాగా ఇష్టపడే వారితో మరియు స్నేహితులతో మాత్రమే మాట్లాడుతుంది, ఆడుతుంది, దేవికది చాలా సున్నితమైన మనసు…..

దేవిక ఇంటర్ లో కళాశాలలో చేరిన రోజులవి, అసలే ఎవరితోనూ మాట్లాడేది కాదు బిక్కు బిక్కు నా క్లాస్ లోకి వెళ్లింది, వెళ్ళగానే తన పాఠశాలలోని స్నేహితులను చూసి ఎంతో సంతోషించింది. ఇటువంటి అమ్మాయి ఒక అబ్బాయికి ఆకర్షణకు లోనయ్యింది, కానీ అది ఆకర్షణ అని చెప్పేవారు లేరు అందరూ తన వయసు వారే తనది ప్రేమ అన్నారు, కానీ ఆ అమ్మాయి తన ప్రేమను ఒప్పుకోలేదు. కానీ అది ఆకర్షణ అని దేవికకి అర్థం కాలేదు. ఇంటర్ చదివిన రెండు సంవత్సరాలు తననే చూస్తూ ఉండిపోయింది. తరువాత డిగ్రీ లో చేరింది, మొదటి సంవత్సరం అంతా తను క్లాస్ కి వెళ్ళడం అక్కడ ఎవరైనా మాట్లాడితే మాట్లాడం లేకపోతే తన పని తను చూసుకుని వచ్చేసేది, కానీ రెండవ సంవత్సరం క్లాస్ లోకి ప్రశాంతి, లక్ష్మణ్ అనే అన్నా చెల్లెలు చేరారు.

తరువాత దేవిక వాళ్ళ ఇద్దరికీ చాలా మంచి ఫ్రెండ్ అయిపోయింది, ఎంతెలా అంటే లక్ష్మణ్ వాళ్ళు దేవిక ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళే వాళ్ళు, ముగ్గురు కలిసి భోజనం చేసిన తరువాత మరలా కళాశాలకు వచ్చేవారు, దేవిక కి ఎటువంటి సహాయం మైన, సలహా అయిన లక్ష్మణ్ చేస్తుండేవాడు. దేవిక కి లక్ష్మణ్ మీద ఇష్టం పెరిగింది కానీ అది తనకు కూడా తెలియలేదు, ఇంటర్ లో కలిగిన ఆకర్షణ యే ప్రేమనుకుంది. చెప్పేవాళ్ళు లేరు కదా ఆకర్షణ అని, చూస్తుండగానే మూడవ సంవత్సరం వచ్చేసింది,

ఒకరోజు అనుకోకుండా లక్ష్మణ్ కి ఎక్సిడెంట్ అయింది, ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న కూడా లేరు, ప్రశాంతి, దేవిక కళాశాలలో ఇంకొందరు అబ్బాయి లు లక్ష్మణ్ ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళారు, లక్ష్మణ్ కి కట్లు కట్టి సిలైన్ పెట్టారు, దేవిక కి లక్ష్మణ్ చేయి పట్టుకొని అక్కడే ఉండాలనిపించింది, కానీ అక్కడ అందరూ ఉన్నారని దూరంగా ఉండిపోయింది, ప్రశాంతి వాళ్ళ అమ్మ నాన్న లకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేసారు, దేవిక ని ఇంటికి వెళ్ళిపోమన్నారు, దేవిక వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళింది.
రెండు రోజుల తరువాత దేవిక కి లక్ష్మణ్ కి ప్రశాంతి కి తన ఇంటర్ లో జరిగిన ఆకర్షణ కోసం చెప్పింది, ఆ అబ్బాయి మెసేజ్ కి రిప్లై కూడా ఇచ్చేవారు కాదని చెప్పింది. మెసేజ్ లు అన్ని చూపించింది, అదే కాకా మరుసటి రోజు ఆ అబ్బాయి ని లక్ష్మణ్ కి చూపిద్దాం అనుకొని, ఆ అబ్బాయి పిలిస్తే వస్తే ఆ అబ్బాయి బండి మీద లక్ష్మణ్ వాళ్ళు ఇంటి వైపు వెళ్ళి అలా ఇంటి దగ్గర దిగింది, అది లక్ష్మణ్ చూసాడు.

తరువాత కొన్ని రోజులు లక్ష్మణ్ కళాశాలకు రాలేదు, దేవిక కి కూడా తన దగ్గరకు వెళ్ళడం కుదరలేదు, ఫోన్ కూడా కుదరలేదు, అప్పుడు తెలిసింది దేవిక కి లక్ష్మణ్ అంటే తనకు ఇష్టమని, ఈ విషయం ప్రశాంతి తో చెప్పింది, తను చాలా సంతోషించింది. కానీ లక్ష్మణ్ వాళ్ళ అమ్మ గారు ముందు ఎవర్నో ప్రేమించాను అని చెప్పిందంట కదా, చూపించిందంట కదా అని అన్నారు. అప్పుడు దేవిక చాలా బాధ పడింది, నిజంగా కాలమే కాలకూటమైంది. దేవిక చచ్చిపోతానని కళాశాలలో బ్లేడ్ తో కోసుకో పోతుంటే ప్రశాంతి ఆపింది.
లక్ష్మణ్ మాత్రం ఆ అబ్బాయి వద్దానాడని నేనా అనడంతో ఆ మాటలకే దేవిక దహనం జరిగిపోయినట్లయింది. లక్ష్మణ్ కూడా ఇంటర్ లో ఒక అమ్మాయి ని ప్రేమించాడు, ఆ అమ్మాయి తనను కాదని వేరే వారిని పెళ్లి కూడా చేసుకుంది, ఇదంతా దేవిక కి తెలిసినా నాకు ప్రస్తుతం ఉన్న లక్ష్మణ్ చాలు గతం వద్దు అన్నా లక్ష్మణ్ నాకు నీ గతమే ముఖ్యం అంటాడు.
అప్పటి నుంచి లక్ష్మణ్ నుంచి దేవిక కి ఫోన్ లేదు మెసేజ్ లేదు, దేవిక చేసిన రిప్లై ఉండదు. దేవికకి ప్రతిక్షణం నరకం గా మారింది. ప్రస్తుతం కరోనా వలన కళాశాలలు మూసేయగా, దేవిక ఇంట్లో నే ఉంటూ లక్ష్మణ్ ఎప్పుడూ మాట్లాడుతాడా అని ఎదురు చూస్తూ, లక్ష్మణ్ ఒప్పుకుంటే ఇంట్లో ఒప్పించి పరిణయమాడాలనే ఆశలతో ఈ ఆయువుని గడిపెస్తుంది.

ఈ మగువ మనసులోని ప్రేమ తన మనసుని దాటి లక్ష్మణ్ మనసుని చేరి మనువుగా మారేనా……?
లేక
మనసులు దాటని ఈ ప్రేమ మరణం వరకు మగువ మనసులోనే నిలిచిపోతుందా……?

You May Also Like

4 thoughts on “మనసులోనే నిలిచిన ప్రేమ

  1. Boddu harika garu mee narating challa bagundi ekkada emotion evali ekkada systematic ga narate cheyali ala chestunnaru suspense kuda bagundii… Thrilling type kuda kasta try cheyandi inka curious vastadi chadavaniki next part eppudu rastaru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!