తొలి ఏకాదశి

తొలి ఏకాదశి

రచన:జాధవ్ ముకుంద్ రావు

ఆషాడ పవిత్ర మాసం
తొలి ఏకాదశి పర్వం ,
శయన ఏకాదశి ఇంకొక నామం !!.

ముఖ్యంగా తొలి ఏకాదశి శుభదినము
రోజున ఒంటి పూట భోజనం చేసి
శేషశాయి అయిన లక్ష్మీనారాయణ నామమును
స్మరిస్తే కోటి పుణ్యం లభించే విశ్వాసం ఉంది !!

తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి
రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాటి
ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను
సేవించడం వల్ల జన్మ జన్మల పాపాలు ప్రక్షాళన- మవుతుంది !!

ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే మహావిష్ణువు
మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక మాసపు
కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు
దానిని పవిత్ర ఉత్థాన ఏకాదశి అంటారు !!

పద్మ పురాణంలో ఈ ఏకాదశి విశిష్టతను
అష్టకష్టాలతో తలమునుకలౌతున్న మానవ జాతిని
ఉద్ధరించాలని సాక్షాత్తు శ్రీహరే వ్రతాన్ని ఆచరించిన
మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది,చూస్తే పురాణాన్ని !!

అతివృష్టి అనావృష్టి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు
చోటు చేసుకోకూడదని ఇతరత్రా ఏ సమస్యలు
ఏదురవకూడదని దృఢంగా దణం పెట్టుకుంటూ
మాసంలోనే బోనాలు పశుపుజనము ఆరాధనాలు!!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!