కలిసిన శుభవేళ

కలిసిన శుభవేళ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

సమీక్షకులు: సుజాత కోకిల

మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన భార్యాభర్తలు కష్ట, సుఖాలలో పాలు పంచుకుంటూ.. ఒకే తాటిపై కలిసి ఉంటూ వేద మంత్రాలు చెప్పినట్టుగా నడుచుకుంటూ.. ఓ ఇంటి బిడ్డ, ఓ ఇంటి కోడలు అత్త మామలను, తల్లిదండ్రులుగా చూసుకుంటూ తల్లిదండ్రులకు మచ్చ లేని బిడ్డగా ఉంటూ.. కుటుంబానికి రక్షణ కవచంలా వ్యవహరిస్తూ.. ఏడు తరాల వారు చెప్పుకునేట్టుగా ఉండే స్త్రీ, మాతృమూర్తి. అమ్మ ఏ బిడ్డలైన తల్లిదండ్రులను గౌరవిస్తూ ముందు తరాల వారికి ఆదర్శంగా ఉంటే మన పిల్లలు కూడా రేపు తరాల వారికి ఆదర్శంగా ఉంటారు. మనిషిలో ఉండే లక్షణాలు ఓర్పు, సహనం, మంచి తనం ఉంటే ఎంతటి కష్టాన్నైనా భరిస్తూ ముందుకు నడిచి వెళ్లే నమ్మకం కుదురుతుంది. ఈ నమ్మకాన్ని అందరిలో కలిగేలా చేద్దాం.

కలిసిన శుభవేళ
రచన.సుజాత కోకిల

ప్రశ్నిస్తున్నావా! గతంలోని నా జ్ఞాపకాలని
ఏమని వర్ణించను నా మధురమైన జ్ఞాపకాలను
నీ పాదాల పారాణితో దేవకన్యలా నడిచి వస్తుంటే
నీ అడుగులలో వినిపిస్తున్న మువ్వల సవ్వడులు
నా గుండెను తాకిన మృదుమధురమైన గానంలా
నీ తొలి పరిచయంలోనే నా గుండెలో కొలువైన
చంద్రబింబం లాంటి కోమలమైన నీ మోములో
నవ్వి నవ్వని చిరునవ్వులు చిందిస్తుంటే
నీ మనసులో నాకు చోటుందని గుర్తించానెే
నా మనసు నీతో పెనవేసుకున్న ఆ క్షణం
చురకత్తిలాంటి చూపులతో నన్ను నేనే మరిచిన
నాకు ఏదో తెలియని మధురమైన భావన
నీ తలపై జీలకర్ర బెల్లం పెడుతుంటే నా వైపు
చూసిన చూపులు మరువలేను నెేన్నటికి
నీ రూపం నా గుండెలో నిలుపుకున్న నీ రారాజుని
నీవు నాతో నడిచిన మధుర క్షణాలని మరువలేను
అగ్నిసాక్షిగా మూడు ముళ్లు వేశాను, నీ మెడలో
ఎన్ని జన్మలకైనా నీ తోడుంటాను.
నా మనస్సాక్షిగా మంత్రాల సాక్షిగా
నీతో అడుగులు వేశాను
ఎన్ని జన్మలకైనా మరవలేను నీ జ్ఞాపకాలని

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!