ఆరోగ్య నీరు

ఆరోగ్య నీరు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: బాలపద్మం

సమీక్షకులు: నారుమంచి వాణి ప్రభాకరి

ప్రతి ఊరిలో లేక ప్రతి పల్లెలో, ఊరు బావి ఊట భావి ఉండటం వల్ల ఆ ఊరు అంతా ఎంతో మంచి నీరు వాడుకొని తాగేవారు. మా పల్లెలో పేరుకు నుయ్యి ఉండేదట. ఆ నీరు చాలా తియ్యగా కొబ్బరి బొండాల్లా ఉంటాయి. ఆ ఊళ్ళో నీరు తాగి
బ్రతకవచ్చు అంటారు. ఏది ఏమైనా ప్రకృతి వనరులు ఎప్పుడు ఆరోగ్యకరమే. పల్లె అంతా అందమైన పెంకుల ఇల్లు, తాటకు ఇల్లు, డాబాలు ఉంటాయి. ఊరికి పెద్ద వాళ్ళదే రెండు మూడు మేడలు ఉంటాయి. ప్రతి ఇంటా నీళ్ల భావి ఉంటుంది. దానిలో నీరు సమయ పాలన అవసరం లేదు. మనకి కావాల్సిన నీరు తోడ్కొని వాడు కునేవారు. ఇప్పుడు సమయానికి నీళ్ళు పట్టుకుని దాచుకోని వంటకి, ఇంటి పనులకి వాడుకోవాలి.
ఎంత డబ్బు ఖర్చు పెట్టిన అక్వా నీరు తాగడానికి, టాంక్ నీరు వాడకానికి రోజు ఆ సమయానికి గిన్నెలు డబ్బాలు రెడీ చేసి పెట్టుకోవాలి. కొన్ని నగరాల్లో ఎప్పుడు ఏ రోజు ఏ సమయానికి నీరు ఇస్తారో తెలియదు. ఒకళ్ళు గంగ పూజ కోసం ఇంట్లో రెడీగా ఉండాలి. పాత్రలు కడిగి ఉంచాలి. ఏది ఏమైనా గాలి, నీరు కూడా చాలా మారాయి పల్లెలో ఆనందం పట్టణంలో లేదు. కానీ జీవితం కోసం తప్పదు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా అనారోగ్యాలు నీటి కాలుష్యం వల్లే వస్తున్నాయి అని వైద్యులు అంటున్నారు కనుక పల్లె జీవితము బావి నీరు ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. కానీ రూకలు ఎక్కడో మూకలు అక్కడ, మూకలు ఎక్కడో రోగాలు అక్కడే పరిశుద్ద నీరు ప్రజారోగ్య వరము.

ఊరు లో బావి
రచన: బాలపద్మం

పల్లెకు అందం చక్కటి ఇండ్లు
ఇంటింటికుండేది ఓ బావి
ఉషోదయాన వెచ్చటి నీరు
మండుటెండలో చల్లటి నీరు
ఆ బావిలో నిత్యం ఊరు
త్రాగడానికదే మంచి నీరు
చక్కగ తోడుకునే వారు
స్నానాధికాలాకు ఆ నీరు
పుష్కలంగా వాడు కునేవారు
నేడేమో భూగర్భాన నీరు
కలుషితం చేస్తున్నారు
త్రాగడానికి చేటు చేశారు
ఫిల్టర్లు ఆర్వో సిస్టమ్ లు
త్రాగే నీటికి ఆధారాలు
అయినా ఆగని రోగాలు
బావులు ఎపుడో కనుమరుగాయె
రోజులు పూర్తిగా మారిపోయె
త్రాగే నీరు భారమాయె
మనుషులు అది మరచిపోయె

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!