వృద్ధాశ్రమాలు

వృద్ధాశ్రమాలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు.

వృద్ధాశ్రమాలు దిక్కులేని ముసలి వారికి
ఒకరకంగా కల్పతరువులు
కొడుకు, కోడళ్ళ నిరాదరణ
కుటుంబ కలహాల పర్యవసానం
కలియుగపు వింత పోకడలు

తల్లిదండ్రులు, శాయశక్తుల తాము పస్తులుండి,
సంపాదించిన డబ్బంతా తమ పిల్లల చదువులకు
వారి ఆరోగ్యం కొరకు, అహర్నిశలు శ్రమిస్తూ
ఖర్చుచేస్తూ, చివరకు చెట్టుల్లా
ఏపుగా ఎదిగిన సంతానం
అదే చెట్టు కింద నిలువ నీడ కూడా ఇవ్వకుండా
నిర్ధాక్షిణ్యంగా తమ తల్లిదండ్రులను
వృద్ధాశ్రమాలకు తరలించే!

దేశవిదేశాల్లో క్షణం తీరిక లేకుండా సంపాదిస్తూ
వృద్ధాప్యం ఒక శాపంగా భావిస్తూ
వయసు మీరిన, తల్లిదండ్రులను
అంటరాని వారిగా భావిస్తు
వృద్ధాశ్రమాలలో చేర్పించి
తమ తమ సరదాలకు సంతోషాలకు అడ్డురాకుండా,
ఉండేందుకు ప్రయత్నించడమే
నేటి యువతరానికి అబ్బింది

నా సలహా ఒకటే!
దేశ ప్రభుత్వాలు ఒక శాసనం చేయాలి
దేశంలో వృద్ధాశ్రమాలు ఉండకూడదు
తల్లితండ్రులను, చివరి దశలో చూడని వారిని,
యావజ్జీవ కారాగార శిక్ష పడేటట్టు శాసించి
చివరిదశలో తల్లిదండ్రులను
కన్నబిడ్డలుగా సాకే వారికి
ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకోవాలి.!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!