ధనుస్సు అందాలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: నారు మంచి వాణి ప్రభా కరి
సూర్యోదయానికి ముందు తెల్ల వారు ఝామున మంచు బిందువులు ముత్యాల్లా రాలుతుంటే.
పిండిలో రంగులు కలిపిన ముగ్గులు
ముంగిట ఎంతో అందము
ప్రతి స్త్రీ ధనుస్సు మాసం అంత కూడా నెల పట్టక ముగ్గులు వెస్తారు
ముగ్గులో చుక్కలు గీతాలు త్రిభుజాలు చతురస్రాలు దీర్ఘ చతురస్రాలు
వక్ర రేఖలు, వంపు రేఖలు ఇలా
మేధస్సుకు లెక్కలు నేర్పుతూ
సృజనకు కళకు పట్టం కడతారు
ముగ్గుల పోటీలో ప్రథమ బహుమతి కాసు లేక అరకాసూ,
15 తులాల వెండి మూడవ బహుమతిగా,
రిచ్ క్యాష్ ఇస్తారు ప్రతి ముగ్గులు పార్టిసిపేట్ బహుమతి ఉంటుంది.
ముగ్గు శ్రీమహా లక్ష్మీ రూపము
అందుకే ప్రతి ఇంటి ముంగిట ముగ్గు అందము.