కరోనా.. కరోనా

కరోనా.. కరోనా
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఎం.వి.చంద్రశేఖరరావు

కరోనా, కరోనా!
ఎక్కడ చూసినా
కరోనా విలయతాండవం.
రోజురోజుకు పెరుగుతున్న మరణాలు
మానవజీవితాలు పిట్టలలా.. రాలిపడుతున్నాయి!
బయటకు రావాలంటే భయం
ఏం జరుగుతుందోనన్న ఆందోళన
సందుసందుకు ఇనుప బారికేడ్లు
బ్లీచింగ్ పౌడర్ల పిచికారీలు
మా సందులోనే మా పొరుగువాళ్ళు
ఎనిమిదిమంది కరోనారక్కసికి బలి అయ్యారు!
అలాంటి సమయంలో
వెయ్యిమైళ్ళ ప్రయాణమైనా
ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందని
పేదవాళ్ళకు, శానిటరివర్కర్లకు అండగా నిలబడుదామంది..నా శ్రీమతి!
అన్నిమరణాలు సంభవిస్తున్నా,
నిర్భయంగా మా వీధి ఊడ్చి రోజూ
బ్లీచింగ్ చల్లే శానిటరివర్కర్ ప్రభావతిని
కొత్తచీరతో ఐదువందల రూపాయలతో
ఆమె ధైర్యాన్ని సేవానిరతిని క్రమశిక్షణను
మెచ్చుకొని సత్కరించింది నా శ్రీమతి!
చుట్టాతా చీకటుందని తిట్టుకుంటు కూర్చోవడంకన్నా చేతనైనంతలో
చిరుదీపాన్ని వెలిగిద్దామని మా వీధిలో
ఆకలితో అలమటించి ఎండిపోయిన డొక్కలతో వ్యాపారం లేక చితికిపోయి
చేతిలో డబ్బులు లేక బిక్కుబిక్కుమంటున్న
రిక్షవాళ్ళకి, ఇస్త్రీవాళ్ళకి, పనిమనుషులకు
ఇలా అనేకమందికి పేదవారికి,
తలా ఐదువందలు ఇచ్చి వాళ్ళ కడుపులు నింపి
వాళ్ళ కళ్ళల్లో ఆనందం నింపాము!
మమ్మల్ని చూసి మా సందులో ఇంకొంతమంది
చైతన్యంతో ముందుకువచ్చి తోటివారికి
చేతనైన సాయమందిచారు!
మనిషికి మనిషే సాయం చెయ్యాలీ!
మానవత్వం చూపించాలీ!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!