ఓ కోతి కథ

ఓ కోతి కథ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన:  యాంబాకం

 అది దట్టమైన అటవీ ప్రాంతం అక్కడే మిట్టమీద ఊరు. ఆ ఊరి పేరు తిమ్మరాజు పాలెం. ఆ ఊరికి కొంత దూరంలో కోతిమూకల నివాసం అందులో ఒకటి ఆ మూకలకు రాజు అది ఆ మూకలతో కలసి చేసే దుండగాలు ఇన్ని అన్ని కావు ఆ ఊరికి తిమ్మరాజు పాలెం అన్నపేరు అందుకే వచ్చింది. ఇంకా చెప్పాలంటే పెద్దలు పిల్లలు ఆ మూక అన్న ముఖ్యంగా రాజు కోతి అన్న తలచుకొంటే నే భయ పడనివాళ్లు లేరు. రాజుకోతి తన కోతి సమూహాన్ని వెంటేసుకొని ఆ చుట్టు పక్కల ఉన్న తోటల్లో పడి అందిన పళ్ళూ, కాయలూ తిన్నన్ని తిని మిగతావాటిని కొరికి కిందపారేసి చెట్లను ధ్వంసం చేస్తుంటాయి. ఒక రోజు  రాజుకోతి తిమ్మరాజు పాలెం వచ్చింది ఒంటరిగా అక్కడ వొక ఎత్తె ఐనా బడి ప్రహరీగోడ మీద కూర్చుని “ఊరు వారిని భయపెట్టి ఏ విధంగా. ఆనందించాలా అని తీరిగ్గా అలోచిస్తూ కూర్చుంది. కోతి రాజు తోక పోడవుగా అందంగా గోడకు వేళాడుతూ కనబడుతుంది. కోతి రాజు కన్న చూసే వారికి ఎంత పెద్ద తోక అని దిష్టిపెట్టాలసిందే. ఆ గోడకు ఇరువైపులా ముళ్లు కంచె ఉన్నదని కోతి రాజుకు తెలియదు. ఇంతలో ఒక పిల్లవాడు అటుపోతూ చేతిలో  అరటిపళ్ళు తీసుకుని పోతుండగా చూసి పిల్లవాడిని భయపెట్టి కుర్.. కుర్…. అని మొఖం చండాలంగా పెట్టి గోడమీదనే గంతులు వేయడం మొదలు పెట్టింది. అది చూసి పిల్లవాడు భయంతో, ఒక అరటిపండు కోతిరాజు వైపు విసిరాడు. “కోతి రాజు వెంటనే ఆ పండును పట్టు కోవడానికి ఎగిరింది పండును దక్కించుకున్నది. కానీ పాపం ఆ పక్కనే ఉన్న కంచెలోని పెద్ద కంపముళ్లు తోక లో గుర్చుకుంది. పాపం కోతిరాజు అందులో ప్రాణం ఎవరికైనా ఒకటే కదా! కెవ్వున కేకవేసి ఎగిరి అవలదూకింది. ఆ ముళ్ళుని లాగటాని ఎన్నో తిప్పలు పడింది  కానీ ముళ్లు రాలేదు. కోతిరాజు ఇలా అవస్థపడు తుండగా ఆ వూరి మంగళి, అతగాడి పేరు. మూడునామాలు ఆదారినే పోతూ కోతి రాజును చూశాడు. చూచి “అదేమిటోయ్ కోతిబావ ఏమిటి అలా పీక్కంటున్నావ్? అని అడిగాడు. ” ఏమీలేదు నామాలమామ, పాడు ముళ్లు ఒకటి నా తోకలోగుర్చుకుందోయ్”అన్నది. “ఒస్అంతేగదా! నే తీసేస్తాలేవుండు. అన్నాడు మూడునామాలు “మామ మామ, నీకు పుణ్యం వుంటుంది.  ఈ బాధ పడలేకున్న కాస్త తొందరగా తీసిపారే అంది కోతిరాజు. “తీస్తా తొందరపడ మాకు నువ్వు కదలకుండా, మెదలకుండా కూర్చోవాలి కోతిబావొ అట్లాగైతేనే తీస్తా లేకపోతే, నావల్ల కాదు మరీ, అన్నాడు మూడునామాలు. “ఓ ఇంతే కదా!సరే మామ నువ్వు ఏం చెప్పితే అదేచేస్తా,రాతిబండ లెక్క లాగే కదలకుండా కూర్చుంటా బరాబర్ అంది కోతిరాజు. మంగళి తన సంచిలో నుంచి పొదునైన కత్తి తీసి నెమ్మదిగా ముళ్లు గుచ్చుకున్న చోట బోచ్చుగొరగబోయాడు. కత్తి తో కత్తి తగలగానే కోతిరాజు గిలిగింతలు పుట్టగా ఒక్కసారి కదిలింది. అందులో కత్తి పొదుపుగా ఉండటంచేత తోకసర్రూన మోన వరకు తెగిపోయింది. వెంటనే కోతిరాజు మూడునామాలు చేయి పట్టుకొని “ఓరీ నీ చెయ్యి విరగా కోతిరాజు తోక నే తెగగొయ్యటానికి నీకు ఎంత ధైర్యం దుర్మర్గుడా! నా తోకను నాకు పెట్టు అని అరిచింది. మూడునామాలు అది నావల్ల అయియే పని కాదు ఇందులో నా పొరబాటు ఏమిలేదు. అన్నాడు, మూడునామాలు ఇంకా కోతిరాజు సరే నాకు నాతోకనైన మళ్ళీ పెట్టు లేకపోతే ఆ కత్తినైనా యిచ్చిపో అని నిర్ణయించి.
” కోతిబావ ఇందులో నా తప్పు ఏముంది చెప్పు కదిలావు తోక తెగింది. నేనేం కావాలనే తెగ్గోశానా!  నా బ్రతుకు ఈ కత్తితో నే వుంది అదిఇస్తే నాగతేం కావాలి చెప్పు. అని అన్నాడు మూడునామాలు విచారంగా. “నువ్వు బతికితే నా కెందుకు చస్తేనాకెరుకెనా నాతోక కోసినందుకు నీకిది శాస్తి అంటూ కోతిరాజు మూడునామాలు చేతిలోంచి కత్తిలాక్కుని వుండాయించింది. “కోతిరాజు కొంత దూరం వచ్చి అక్కడొక చెట్టు కింద కూర్చుంది తెగినమొండితోక ను చూసుకుందామని ప్రయత్నించింది”. కానీ కనిపించిలా. ఇంతలో అక్కడ వొక మామిడిపళ్ళు అమ్మే మనిషి కూర్చుని గంపలో పండు ఒకటి తీసుకుని తినటం చూసి కోతిరాజు ఆ మనిషి తో మామిడ పళ్ళ మనిషి మామిడి పళ్ల మనిషి అదేమిటీ అట్లానోటితో కొరుక్కుని తింటుడెంది? చక్కగా కత్తితో తోలు తీసి సన్నని ముక్కలు కోసుకొని తినరాదూ”అన్నది.
“కోతిబావ నేను బీదవాడిని మాకు ఈ చాకులు కత్తులూ యా నుండివస్తావ్”అన్నాడు పండ్ల మనిషి.
“నాదగ్గిర వొక మంచి కత్తి వుంది కావాలంటే కాసిని కాయలు కోసుకొని తిను,దీనికే గేమైన కత్తి అరిగి పోదులే అని మాయ మాటలు చెప్పి కోతిరాజు కత్తి ఇచ్చింది. పండ్ల మనిషి నాలుగైదు పళ్ళు కోసి పళ్ళు అమ్మసాగాడు తను కూడా ఆ కత్తితో రెండు పళ్ళు కోసుకొని రుచి చూసాడు. కానీ కోతిరాజు మనసులో ఒక్క ముక్క కూడా తనకి పెట్టడంలేదే అని కోతిరాజు చూస్తోంది. పండ్ల మనిషి తిరిగి కత్తి కోతిరాజు కిచ్చింది. కోతి రాజు కత్తి వంక చూసి “ఎంత తెలివైన మనిషివి కత్తి అంతా మొండి చెసి ఇస్తావా? నేనిచ్చినప్పడు తళ తళ మెరుస్తున్నదే. ఇప్పుడైతే చూడు మల్లా పదునంతా పోయి మొండిగా తయారైయింది. పాడుకత్తి నువ్వే వుంచుకో కత్తికి బదులు ఆ పళ్ళగంప ఇచ్చి వెళ్లు అన్నది కోతిరాజు దర్జాగా! పాపం పండ్లమనిషి తెల్ల బోయింది.”కోతిరాజు నేనేమ్మన గొంతులు కోసుకొనా ఈ కత్తితో తీసుకోవడానికి ఏదో యీ పళ్లు అమ్మి నాలుగు డబ్బులు సంపాదించుకొని నా పొట్టపోసు కోనేవాన్ని నానోట్లో మట్టి కొట్టుకు అన్నాడు పండ్ల మనిషి. “నువ్వు నీ నోట్లో మట్టే కొట్టు కుంటావో బంగారమే కొట్టు కుంటావో నాకెందుకూ నాకు తెల్వద్  మామూలు కత్తి నా కిచ్చి నా సరే లేదా పండ్ల గంప ఇచ్చి ఐనా వెళ్ళు అన్నది కోతిరాజు మొండి కేసి. ఇదేం తంటారా దేవుడా”అని పండ్ల మనిషి విచారిస్తుండగా కోతిరాజు పండ్లు గంపఎత్తు కొని భుజం మీద పెట్టుకుని అక్కనించి ఉడాయించింది. పళ్ళ గంప తో కోతిరాజు వొక పొలం గట్లు పైన ఉన్న ఊత చెట్టు దగ్గరకు వచ్చి ఆ పళ్ల గంపను దింపి అలా చూడసాగింది. అక్కడ ఒక ముసలి రైతు గెదలు కాస్తూ చాలా నీరసంగా ఉండటం చూసి ఏం ముసలయ్య అలా నీరసంగా వున్నవేం? ఆకలి అవుతొందా? అని అడిగింది.
“అవును కోతిబావా పొద్దుట సద్దిబువ్వ కూడ తిన లేదు మా ముసలి తెస్తానన్నది ఇంత వరకు రాలేదు ముసలి కి నూకలు దొరికావో లేదో పొద్దు నడికి ఎత్తింది మా చెడ్డ ఆకలేస్తుంది.అన్నాడు ముసలి రైతు.  “అలాగనా పాపం ఇవిగో నా దగ్గర మంచి పళ్ళు మామిడి పళ్లుగంపెడు ఉన్నాయి, నీకు కావలసి నన్ని తిను,అని పళ్ల గంప ముసలి రైతుకి ఇచ్చింది. కోతిరాజు. ముసలి రైతు ఆత్రంకొద్ది పళ్లు వరస బెట్టి తినటం మొదలెట్టాడు. ఇంక గంపలో నాలుగైదు పళ్ళుఉన్నాయనగా కోతిరాజు కుర్.. కుర్.. మంటూ లేచింది. “ఏం ముసలయ్య ఏదో పాపం ఆకలిగా ఉన్నావని ఒకటి, అరో,తింటావను కొంటే గంపెడు పళ్ళు తిన్నావ్?ఏదో దయతలచి తినమన్నను గదా అని గంపెడు పళ్ళుతిని కూచున్నవ్! భలేవాడివే నాపళ్ళు నాకు కక్కు లేదా ఆ గెదను ఇచ్చేఅన్నది కొతిరాజు. పాపం ఆ ముసలిరైతు బిక్కమొహం వేసి “ఇదిగో కోతిబావ ఎందుకు అలా కోప్పడతావు. నీవు తినమంటేనేగా తిన్నాను.గెదను తిరిగి ఇంటికి తీసుకెళ్లక పోతే మా దగ్గర పాలు వాడుక వారు నన్ను చితక కొడతారు. కోతిబావ నన్ను వొదిలిపెట్టు అన్నాడు. ముసలయ్య.
కానీ కోతిరాజు కు జాలికలగలేదు. ముసలయ్య చేతిలో ఉన్న కర్రను లాకుని గెదను తోలుకు పోయింది. పాపం రైతు చూస్తూ ఉండి పోయాడు.
గెదను తీసుకుని వస్తుండగా కోతిరాజు వొక కొట్టాం కనిపించింది. అక్కడ ఒక గొల్లపిల్ల మజ్జిగ చిలికి వెన్నతీసి అమ్ముతూ కనపడింది. ఇదిగో పిల్లా ఇంత కొద్ది మజ్జిగ కు నీకు ఎంత ఆదాయం వస్తుందని ఇదిగో నా గెద ఇది సేర్లకు సేర్రులు పాలు ఇస్తుంది అప్పుడు ఎక్కువ మజ్జిగ ఎక్కువ వెన్న వస్తుంది ఆదాయం బాగా వస్తుందని మాటల తో గొల్లపిల్ల దగ్గర వదిలాడు.  గొల్లపిల్ల గెదను కట్టేసి పాలు పితికి ఎక్కువ మజ్జిగ తయారు చేసి వెన్నను తీసి ఉట్టి పై దాచింది. కోతిరాజు రెండు రోజులు చూసి ఆ ఈ గొల్లపిల్ల నాకు కడుపు నిండా తిండి పెట్టనే లేదు. అని పొద్దున గొల్లపిల్ల తో  ఏం పిల్లా నా గెద నీకు ఇచ్చి నప్పుడు పుష్ఠిగా ఉన్నాది. ఇప్పుడు డొక్కలు పీక్కు పోయేదాక పాలు పితికేస్తున్నావే, చూడు ఇప్పుడు కాసేపటీకో చనిపోయే టట్టు గా ఉందే నీవే వుంచుకో నాకు ఈ గెద అక్కరలేదు నా గెదకు బదులుగా నీవు దాచుకొన్న వెన్న అంత నాకి ఇచ్చే అంది. గొల్లపిల్ల తెల్లబోయి కోతిరాజు ఇలా అడగటం నీకు న్యాయమేనా! వెన్నకాచి నెయ్యి యిస్తానని నేను చాలా మంది దగ్గర డబ్బులు కూడా ముందుగా తీసుకున్ననే నెయ్యి యివ్వక పోతేనన్ను బతక నిస్తారా! క్షమించు వెన్న ఇవ్వలెను అంది  గొల్లపిల్ల. “ఏమిటీ ఇవ్వలేవా! ఎలా ఇవ్వవో అంటా కోతిరాజు వెన్న ముంత నెత్తిన బెట్టుకొని దౌడుతీసింది. కోతిరాజు వెన్నముంత నెత్తిన పెట్టుకొని వస్తుండగా దోవలో వో పెదరాశి పెద్దమ్మ దోసెలు పోస్తున్నది.  కోతిరాజు పెద్దమ్మ దగ్గర చేరి పెద్దమ్మ  నీవు దోసెలు కుప్పలు కుప్పలు గా పోస్తున్నావు కానీ కమ్మని వాసన రదేం ఇలాంటివి ఎవరుకొంటారు, ఎవరుతింటారు. దోసె చుట్టూ కాస్త వెన్న రాస్తే చాలా మంది వస్తారు తినేవారు కొనేవారు నీ వ్యాపారం బాగా సాగుతుంది కదా! అన్నది.
” నీవు చెప్పినట్లు నిజమే కానీ నాకు నెయ్యి వెన్న ఎట్లా వస్తుంది. నాపేరే పెదరాశి పెద్దమ్మ, అంది పెద్దమ్మ ” పెద్దమ్మ నీకు నిజంగా కావాల్సి వుంటే ఇదుగో నా దగ్గర వెన్నముంత ఉంది. నీకు కావాల్సి నంతవాడుకో! నాకు మాత్రం ఒక్కటంటే ఒక్క అట్టు పెట్టు చాలు అన్నది కోతిరాజు. పెదరాశి పెద్దమ్మ వెన్నను తీసుకుని దోసెలు పోయటం మొదలు పెట్టినది. పెద్దమ్మ దగ్గర ఉన్న పిండి అంతా ఐపోయింది. వెన్న కూడ సగానికి పైగా అయిపోయింది. పెద్దమ్మ మిగిలిన వెన్న తిరిగి కోతిరాజు కి ఇచ్చేసింది. కోతిరాజు వెన్నముంత తొంగి చూసి పెద్దమ్మ ఏమో అను కొన్నా భలే దానివే ఈ కాస్త వెన్న నేనేం చేసుకోను నువ్వే వుంచుకో నీవు పోసిన ప్రతిదోసెలో నా వెన్న ఉంది. అందుకని దోసెలు నావే మిగిలిన వెన్న నీదే”అన్నది. పేదరాశి పెద్దమ్మ కి ఏమి తోచక పొయ్యి వూదే గొట్టం తో దేహశుద్ది చేస్తేగాని ఈ కోతిరాజు దారికి రాడు అనుకొని గొట్టం కోసం పొయ్యి వైపు తిరిగింది. ఇదే సందు గదా అని కోతిరాజు దోసెలు ఉన్న గిన్నెను నెత్తిన బెట్టుకొని వోకటే పరుగు తీసింది. దోసెలు నెత్తిన పెట్టుకొని వస్తున్న కోతిరాజు కు వొక మనిషి డోలు మోసుకొని వస్తూ కనిపించాడు. కోతిరాజు “ఏం డోలుబావా ఎక్కడ కి ప్రయాణం?అని అడిగింది. ఇక్కడి కే నోయ్ కొతిబావ పక్క వూరిలో పెళ్లి కి డోలు పిలిచారు అన్నాడు డోలయ్య సరే అని ఇద్దరు కలసి నడవసాగారు. ఇంతలో నే వొక చెరువు దగ్గరకు వచ్చారు కోతిరాజు డోలు మామతో డోలుమామ చాలా దూరం వచ్చాం కాళ్ళు లాగుతున్నాయి కదూ! కమ్మని దోసెలు కాసిన్ని తిని ఆ చెరువు లో నీళ్ళు కడుపు నిండుగా తాగితే ఎంతోఆహాయిగా ఉంటుంది కదూ! అన్నది. “నిజమే కానీ నట్టిఅడవిలో మనకి దోసెలు  ఏమైనా ఆకాశన్నించి రాల్తాయా! అన్నాడు డోలువాడు.
“ఆకాశం నుంచి రాలటమేందు కోయ్ మన దగ్గరే లేక పోతేగా యివిగో నాదగ్గర బొలెడు కమ్మటి వెన్నరాసిన దోసెలు కాళ్ళు చేతులు కడుకో తిందాం అన్నది కోతిరాజు. సరేనని డోలయ్య కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి దోసెలు తీసుకొని  తినటం మొదలు పెట్టాడు.కోతిరాజు మాత్రం పక్కన చూస్తూ కూర్చుంది. డోలయ్య వంచిన తల ఎత్తకుండా దోసెమీద దోసె గొంతుదాక మెక్కాడు. కోతిరాజు అదిచూసి మండిపడుతూ “చిందులు వేస్తూ చాల్లేవయ్యా భలే పెద్ద మనిషి వి ఏదో పుణ్యానికి కాసిన్ని తినమంటే అన్ని తింటావా! నా దొసెలు నాకుతే లేదా నీ డోలన్న నాకివ్వ అన్నది. డోలువాడు గుడ్లు అప్పగించి కూర్చున్నాడు. గొంతు వరకూ మెక్కటం చేత అతనికి నోటెంట మాటకూడ రాలేదు. ఏం చేయ్యటం రా! స్వామి అని అలోచింస్తుండగా కోతిరాజు డోలును తగిలించుకొని వొక్క దౌవుడు తో పరుగు పరుగున తన కోతి సమూహం దగ్గరకు చేరుకుంది. కోతులన్ని కోతిరాజును చూడగానే లేచి నిల్చుని సలాం చేసినాయ్ కోతుల మంత్రి “రాజా ఈ వేళ తమరు చేసిన ఘనకార్యాలు సెలవిస్తే చెవులారావిని ఆనందిస్తాం”అన్నాడు. “సరే అందరూ కూర్చోండి అని.. కోతిరాజు డోలు మోగిస్తూ ఈ పాట పాడారు. “తోకపోయి కత్తి వచ్చే డుంమ్.. డుంమ్.. డుంమ్,”కత్తి పోయి పళ్ళు వచ్చే డుంమ్…డుంమ్…డుంమ్, “పళ్ళు పోయి గెదవచ్చే డుంమ్…డుంమ్…డుంమ్,
“”గెదపోయి వెన్నవచ్చే డుంమ్.. డుంమ్.. డుంమ్,
“”వెన్నపోయి దోసెవచ్చే డుంమ్.. డుంమ్…డుంమ్,
“”దోసెపోయి డోలువచ్చే డుంమ్…డుంమ్…డుంమ్,
డుంమ్.. డుంమ్… డుంమ్…. డుంమ్….డుంమ్….!
ఇది వినగానే కోతులన్ని ఎగిరి గంతులెయ్యటం మొదలు పెట్టాయ్ అడవి అంత “కోతులగోల” మారు మోగి పోయింది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!