మనసు భావం

మనసు భావం

రచన::పి. వి. యన్. కృష్ణవేణి

నిండు కుండలాంటి మనసు నాది
తొణకణీ బెనకణి ధైర్యం నాది
ఆలోచించి అడుగువేసే స్వభావం నాది
ప్రేమ నిండిన హృదయం నాది

కల్లాకపటాలు ఎరుగదు నా మది
భేషజాలకే పోని గుణం అలవడింది
స్వచ్చమైన పసి పిల్లల నవ్వు
పాలవంటి తెల్లనిది నా నడత

ఎందుకో ముగపోయింది కోయిల పాట
మరి ఎందుకో గాయపడింది నా మనసు
కలత చెంది నిద్రలేని రాత్రులు ఎన్నో
తెల్లని జాబిలి చల్లని వెన్నెలను ఆస్వాడించలేకున్నాను

కుళ్లు రాజకీయాలు కలిగిన మనుష్యులు
కూతంత్రాలు నిండిన మనసుతో
నా కష్టసుఖాలను క్రీగంట గమనిస్తూంటే
నాకు మౌనమే హాయి అని నా మనసు భావం..

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!