ఆనాటి నిజమైన తృప్తి

ఆనాటి నిజమైన తృప్తి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: కొల్లూరు వెంకటరమణమూర్తి

ఆరుబయట రాళ్ళపొయ్యిపైన కుండల్లో
సగం సగం కాలే కట్టెల మంట వెలుగుల్లో
ఉడికీ ఉడకని అన్నం గంజి సువాసనల్లో
మరో పొయ్యి పైనున్న దాకనుండి వెలువడే
నోరూరించే శాకాల పులుసు కమ్మదనంతో
పక్కనే వేచియున్న శునకపు చూపుల్లో
దూరాన గోమాతల అంబా అరుపుల్లో
మబ్బుల్లోంచి తొంగిచూసే చందమామలో
అప్పుడప్పుడు వీచే పిల్లగాలి చల్లదనంలో
కాస్సేపట్లో వేడి బువ్వ తిని గంజి తాగి
నులక మంచాలపై నడుములు వాల్చి
ఇరుగుపొరుగులందరూ చెప్పుకోబోయే
లోకాభిరామాయణం కబుర్ల ఊహలలో
ఆనాటి నిజమైన తృప్తిన ఆ ఆనందంలో
మునిగితేలుతున్న ఆ రాత్రి తొలిజాము
చేయగలిగేది మరునాడు వేకువజామును
చురుకుదనంతో కర్తవ్యం దైవమాహ్నికం అని
జీవనపోరాటంలో ముందుకు సాగిపోయేలా!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!