రాజీ పడకు…!

రాజీ పడకు…!

రచయిత :: చైత్రశ్రీ(యర్రాబత్తిన మునీంద్ర)

chaitra sri

ఇది స్వార్థపు పొరలు కప్పుకొని
సుప్తావస్థలో ఉండాల్సిన సమయం కాదు…

చీకటి కమ్ముకున్న మసక గుండెల
వెలుగు నింపాల్సిన అత్యవసర సమయం….

ఎవరో చేసిన తప్పుకు ఎవరు బలౌతున్నారో
ఎందుకు బలౌతున్నారో తెలియని దుస్థితి….

నిర్లక్ష్యం చేసి పీకలపైకి తెచ్చుకొంటూ
చేసేదేమీ లేదంటూ చేతులెత్తేసిన గడ్డుకాలం…

తప్పెవరిదైనా తిరిగిరాని ప్రాణం
దెబ్బతిన్న శరీరం మరలిరాని ఆరోగ్యం
గుర్తెరిగి నడుచుకో….
అతి జాగ్రత్తే నేడు విలువైనదని తెలుసుకో
ఎందులోనూ రాజీ పడకు నేస్తమా…!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!