పుడమి.

పుడమి

రచయిత :: సుజాత.కోకిల.

పుడమిపై పుష్పించిన పుష్పాన్ని నేనే
పుడమిపై విరజిమ్మే అరుణారుణ జ్వాలని నేనే
పుడమిపై విరబూసిన.నీటిలోని తారను నేనే
పుడమిపై వెన్నెల కురిపించే చంద్రుడ్ని నేనే
పుడమిపై అందాలను వెదజల్లే ప్రకృతిని నేనే
పుడమిపై గలగలా పారే గోదావరి నేనే
పుడమిపై వెలసిన కనబడని శక్తిని నేనే
పుడమిపై పుట్టిన నీ బిడ్డపై ప్రేమను పంచేది నేనే
పుడమిపై రాలే విషబిందువులు ఎన్నియైన
పుడమి తల్లి ఇవ్వాలి మనకు పారద్రోలే ఆ శక్తిని
పుడమిపై సంచరించే దారులు ఎన్నియైన
పుడమిపై ఉన్న నా ఊపిరే నిజాయితీగా ఉన్న
పుడమిపై కొవ్వత్తిలా కరిగిపోయే జీవం నాది
పుడమిపై జీవించి ఉన్నంతకాలం నేను
పుడమి తల్లికి రుణపడి ఉంటాను

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!