నా ఇష్ట సఖి
రచయిత :: శ్రీలత. కే
నీ పరిచయం నాకు తొలిప్రేమ మధువును రుచి చూపింది..
నీవు నాతో మాట్లాడుకున్న నీ కళ్లు నన్ను ప్రతీ రోజు పలకరించేవి.
వైశాఖ మాసపు మల్లెల సుగంధ పరిమళాలు
నీ ఆలోచనలు నాలో..
హిమాలయ శిఖరాలంత ఎత్తు నా మదిలో నీ స్థానం.
బృందావనంలో మురళి గానం నా చెవులకి నీ మాటలు
కోపంలో.. బాధలో..
ఆనందంలో.. విషాదంలో.
నీ జ్ఞాపకాలు నాకు తొలి భానుని కిరణాల్లా కొత్త ఉత్సాహన్ని ఇస్తాయి..
నన్ను వీడి నువు ఉన్నవేమో..
నిన్ను వీడి నా మనసులేదు..
అప్పుడు..
ఇప్పుడు..
ఎప్పుడు..
నువ్వే నా ఇష్టసఖీ..
నీకే నా ప్రేమ పట్టాభిషేకం..