తారమ్మ రాయభారం

తారమ్మ రాయభారం

కలల కావేరి,కన్నె గోదారి.
వధువు గా మారి.!!

ఆశల తీరాల్లో తనకు తానే వెతికే.
వలపు విలుగాని జత చేరే క్షణాల కోసం.!!

మమతల కోవెల తలుపు తెరిచి.
వెన్నెల్లో మల్లెపూల పానుపేసి వేచె.!!

నిశినే కాటుక గా మలిచిన కన్నుల్లో ఒత్తులు వేసుకొని.
ఎనెన్నో కలలు కంటూ.!!

నా వాలు జడలోని మరుమల్లెలు.
ముసి ముసి నగవులు రువ్వుతూ.!!

నా చెవులకు పెట్టిన జుంకాలు.
చిలిపి ఊసుల గుసగుసలకై.!!

నా చేతి గోరింటాకు ఎర్రని తాంబులమై.
పసిడి బుగ్గల్లో సిగ్గుల మొగ్గలు పూయిస్తూ.!!

నా మేను ని అలంకరించిన అందాలు అన్ని..
తన రాకకై ఎదురుచూస్తూ..
అడవి కాచిన వెన్నెల అవుతున్నాయి అని

నా మనోహారునికి..
ఆకాశ దేశాన తారలతో రాయబారమంపె.!!

రచయిత:జయ

 

You May Also Like

One thought on “తారమ్మ రాయభారం

  1. తాయారమ్మ రాయభారం బాగా రాసావు తల్లి.నీకలంనుండి ఇంకా మంచి మంచి కథలు కవితలు రావాలని కోరుకొంటూ మనసారదీవిస్తున్న తల్లీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!