పరికరాలతో పరుగులు
రచన: ఐశ్వర్య రెడ్డి
మానవాళి ఎదుగుదలకు సాంకేతికత
మొదటి మెట్టు
ఇక పరికరాల రూపంలో మన చుట్టూ
లాప్టాప్ సెల్ఫోన్లలో జీవితం
అవి లేకుంటే లేదు మరి జీవనం
నాడు రచ్చబండ దగ్గర ముచ్చట్లు
నేడు వాట్సాప్ గ్రూపు లో అక్షరాల అచ్చట్లు
నాడు వంటిల్లే వైద్యశాల
నేడు వంటిల్లే పరికరాల ప్రయోగశాల
నాడు శ్రమతో జీవనం
నేడు మెదడుకు మేత ఎక్కువై
ఒళ్ళు కదలక భారమైన వైనం
ఆనక దావఖాన కు పడెను బాటలు
అచ్చట వేలకు వేల బిల్లులు
అది చూసి పడే గుండె కు చిల్లులు
ఇక మొదలు వ్యాయామశాల కు పరుగులు
అద్దాల మేడలో యంత్రాలతో జీమ్మీక్కులు
మానవ బంధాలనుా మాటను మరచీ
పరికరాలే మనకు నేస్తాలయి
మనిషి యంత్రానికి బందీ అయి
జీవితమే ధనార్జనే లక్ష్యమై సాగగా
పెరిగేను బాల్యము నుండే రోగాలు ఆస్తులుగా
పిడికెడు మందులే ఆహారంగా
మారేను బతుకు చిత్రం గా
అస్తవ్యస్తమైన జీవనం మార్చుకో ఇక తక్షణం
చల్ల గాలి పీల్చుకో శ్రమదానం చేసుకో
ఆరోగ్యమే భాగ్యం గా భావించి చూసుకో పరికరాలతో పయనం సాగినా
అదే జీవితం అని మురవక
మనసు తోడ మసులుకో
మనిషివని తెలుసుకో
బతుకు తీపి మరువక
బాంధవ్యం పెంచుకో.
Super
Awesome. 👍👍👍👍 true
Super true👌👌👌👌👌👌