అవును నేను బందీనే

అవును నేను బందీనే

శిరీష వూటూరి

అవును నేను బందీనే……..

అమ్మానాన్నలు చూపే అమితమైన
అమృతతుల్యమైన ప్రేమకు బందీనే

మావారి నిష్కల్మషమైన మనసుకు
నిర్మలమైన మమతకు బందీనే

అమ్మగా మాతృత్వపు మధురిమలో
తేలియడుతూ ఓలలాడుతున్న బందీనే

అక్కాచెల్లెళ్ల,ఆడబిడ్డల ,అన్నదమ్ముల
అనురాగాల చెరసాలలో బందీనే

స్వచ్చమైన చెలిమి పంచే స్నేహితుల
సాన్నిహిత్యానికి బందీనే

చదువు నేర్పిన గురువుల నిబద్ధతకు
జీవితాంతం బందీనే

ఆత్మీయులందరి అందమైన
పలకరింపులకు ఎల్లప్పుడూ
బందీనే

మనసు స్వేచ్ఛ కోరుకోవడం లేదు
బందీగానే ఉంటానంటోంది మరి……

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!