చిరునవ్వుతో

చిరునవ్వుతో..

రచన: శ్రీదేవి విన్నకోట

ఓ చిరునవ్వు ఎల్లప్పుడూ
మన మోముపై కదలాడుతూ ఉంటే కళకళలాడే అల్లరికళ్ళతో
మన పెదవులపై పారాడే చిరునవ్వుని చూస్తే
బ్రతుకు మీద ఆశ పుడుతుంది
హాయిగా నవ్వుతూ జీవితాంతం బ్రతకాలి అనిపిస్తుంది,
నవ్వుకి ఉన్నంత బలం
నవ్వుకి ఉన్నంత అందం
నవ్వుకి ఉన్నంత కలుపుగోరుతనం
నవ్వుకి ఉన్నంత
ఆనందమయ జీవనం
ఇద్దరు మనుషుల మధ్య దూరం చెరిగిపోవాలన్న
రెండు మనసులు ఏకం కావాలన్న,ఎదుటివారి మనసును గెలవాలన్న,
నిన్ను నువ్వు తెలుసుకోవాలన్న
అన్నింటికీ మూలం నీచిరునవ్వే
అందుకే ఆ చిరునవ్వును
నీ మోముపై చెదరనియ్యకు
చిరునవ్వును కోల్పోయి
జీవితాన్ని కష్టాలతో దుఃఖమయం కానివ్వకు.
ధనం మూలం ఇదం జగత్ ఒకనాటి మాట
చిరునవ్వే అన్నిటికి మూలం ఇది నేటి మాట
అందుకే గుర్తుంచుకోండి ఎప్పటికీ ఈ మాటను ముత్యాల మూట గా
మీ వంతుగా పాటించండి అందరూ చిరునవ్వుతో. 😊

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!