వెళ్ళిపో ప్రియతమా!
రచన: శ్రీలత. కే (హృదయ స్పందన )
వెళ్ళిపో ప్రియతమా
నాలోంచి శాశ్వతంగా..
మళ్ళీ నువు గుర్తొచ్చి
గుండెలోని బాధను పెంచక.
నీ మాట విన్న తొలిసారి
ఇష్టమే నేను పెంచుకున్న
నీ మనసు రూపు చూసాక
మదిలో ప్రేమ కు స్థానమే ఇచ్చేసా..
ఎందుకో తెలియకుండానే
ఎదలోతుల్లోకి చేరావు
తెలియని గిలిగింతలేవో
మనసుకి పరిచయం చేసావు.
సరికొత్త ఊహల్లో
నాలో మైకం నింపావు
ప్రేమ పుష్పమై నాలో ఉదయించావనుకున్న
అనురాగ పరిమళాలేవో వెదజళ్ళతావని ఆశపడ్డ
నీకై నాలో ఆశలెన్నో పెంచుకున్న.
నా ప్రేమ కలలన్నీ కల్లలుగా మార్చేస్తూ..
నా మనసుకు దూరంగా వెళ్తూ ..
నీ జ్ఞాపకాలలో నన్ను ఒంటరిని చేసావు.
వెళ్ళిపో ప్రియతమా..!
నాలోంచి శాశ్వతంగా…
మళ్ళీ నువు గుర్తొచ్చి గుండెల్లో బాధే పెంచక..!
***