మానస వీణ

మానస వీణ

రచన:: యువశ్రీ బీర

అవును…!

పరుగుతీస్తుంది మనసు…
ఎంత ఆపినా ఆగదు మరి…
ఎల్లలులేవు మనసుకు, దేశదేశాలు తిరుగుతుంది…
జ్ఞాపకాలతో షికార్లు కొడుతుంది…
ఆలోచనలతో పిచ్చెక్కిస్తోంది…

భలే మనసులే…!

భావాలతో ఆడుకుంటుంది…
భావోద్వేగాలతో అతలాకుతలం చేస్తుంది…
చిరుగాలికి స్వాంతన పొందుతుంది…
పైరగాలితో ముచ్చటిస్తుంది…
కరిమబ్బులను కళ్ళార్పక చూస్తుంది…
చిరుజల్లుకు చిందులేస్తుంది…
ఝడివానకు గుండె జార్చుతుంది…
కష్టానికి మంచులాకరిగి
కన్నీరై కారుతుంది…

అబ్బో…!

ఎంత చెప్పినా తక్కువే, ఈ మనసు గురించి…
భావాలను పెనవేసి,
కవితలల్లుతుంది…
ఆలోచనలు మదించి, సాహితీలోకంలో విహరిస్తుంది…
ఊహలకు రెక్కలు తొడిగి, బృదావనంలో నాట్యమాడుతుంది…
మనసు మసకేసినపుడు మౌనంగా ఉంటుంది…
మనసు వీణపై వినిపించని స్వరాలెన్నో,
మౌనంగా ఆలపిస్తుంది…
మౌనాన్ని కూడా మంత్రంలా భావిస్తుంది మనసు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!