తొలి మహోత్సవము

అంశం : (“తెలంగాణ బోనాలు”)

 తొలి మహోత్సవము

-పిల్లి.హజరత్తయ్య

Pilli hajaratthayya

తరతరాల నమ్మకాలు సాంప్రదాయాల
ఆచార రూపమే బోనాల పండుగ
ప్రజల కడగండ్లు తీర్చే అమ్మవారికి
భక్తి నైవేద్యం సమర్పించే వేడుక

మనిషిని కాపాడిన దేవతలను
దుష్టసంహారం చేసిన దేవి అవతారాలను
భక్తిభావంతో పూజించే
రౌద్రం,శాంతి మేళవింపుల ఉత్సవము

సమాజ శ్రేయస్సు ఆకాంక్షించి
సమాజాన్ని గౌరవించే దినోత్సవము

తల్లిగారింటికి కుమార్తె వచ్చినట్లుగా
అమ్మవారికి కానుకలు సమర్పించి
ప్రకృతిని,అమ్మవారిని కొలిచే వేడుక

‘బలి’ అనే ఆచారాన్ని గావించి
మనిషి జీవితానికి ప్రతీకైన
మట్టి కుండ బోనం సమర్పించి
అమ్మవారిని ప్రసన్నం చేసుకునే పర్వదినము

స్త్రీకి మహంకాళి దేవతా వహించి
భవిష్యత్ దర్శనం గావించు పండుగ

కోలాహలమైన ఊరేగింపు ఘట్టంతో
అమ్మ వారి నిమజ్జనం కావించే తొలి మహోత్సవము

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!