ఢావలో

(అంశం : “బంజారా మహిళల హృదయ గాథలు”)

ఢావలో

సప్త సముద్రాలతో ఎన్నో నదులు
అష్ట దిక్కున మరెన్నో పర్వతాలు,
దేశమంతటా మన బంజారా జాతి పూర్వికులు
నివసించేది అడవి చారిత్రాత్మక ప్రదేశాలు !!

వేర్వేరు స్థానాలలో వృత్తిరీత్యా గమనం
మళ్లీ ఎప్పుడు కలుసుకుంటాము అనే భయం,
సమయాన్ని విలువను ఇచ్చే అనుబంధం
ఇవన్నీ విషయాలు “ఢావలో” తో సంబంధం !!

బంజారాల యొక్క రీతి నియమాలు
ఎన్నోసార్లు మరొక్క చోటు జీవిత వలసలు,
ప్రేమ దుఃఖాలతో కలిసిన బంధువులు
అలాంటి సమయంలో “ఢావలో”తో వియోగలు !!

బంజారా మహిళ రాగనురాగాలు
హృదయము నిండిన కన్నీళ్లు స్వరాలు,
పెళ్లి ఉన్న పండుగల వివిధ సందర్భాలు
బంజార మహిళల సుఖదుఃఖాల జ్ఞాపకాలు !!

కుటుంబంలో గొడవలు ప్రేమలు
దయ కరుణ ఆనందముతో కోరికలు,
జీవిత ఆసక్తికరమైన కొన్ని విషయాలు
“ఢావలో”తో వ్యక్తపరిచే మహిళ ఆశయాలు !!

“ఢావలో” బంజారా మహిళా భావోద్వేగం
“ఢావలో” మహిళా ఆత్మానుభూతి ఆక్రోశం,
“ఢావలో” పరిస్థితుల యొక్క ఉత్సాహం
“ఢావలో” బంజారా మహిళలోకంలో కావ్యం !!

“ఢావలో” సుఖదుఃఖాల యోగ వియోగం
“ఢావలో” నవరసాల అంతర్గతమైన స్వరూపం,
“ఢావలో” మహిళ కళ్ళలో కనిపించే మనోగతం
“ఢావలో” అమ్మ నాన్నలు నేర్పించిన మంచి కవిత్వం !!

“ఢావలో” కన్నీటి భరితమైన హృదయగానం
“ఢావలో” అమ్మ అత్తమ్మ అక్క పాడే ప్రతిబింబం,
“ఢావలో” స్వర యుక్త కఠోరమైన పాటల యజ్ఞం
“ఢావలో” తియ్యని పదాలతో వర్ణించేది జనం !!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!