బ్రతుకు పోరాటం (పాట సమీక్ష)

 బ్రతుకు పోరాటం (పాట సమీక్ష)

రచన: క్రాంతి కుమార్

చిత్రం: దేశముదురు
పాట: సత్తె యే గొడవ లేదు
సత్తె యే గోల లేదు
పుట్టె ప్రతి వోడు సత్తడోయ్
రచన: భాస్కర బట్ల

పాట సమీక్ష:

” సత్తె యే గొడవ లేదు
సత్తె యే గోల లేదు
పుట్టె ప్రతి వోడు సత్తడోయ్”

రచయిత భాస్కర బట్ల ఈ పల్లవి లో జీవిత పరమార్థం చెప్పాడు పుట్టినప్పుడు మనకు తెలియదు పుట్టామని చనిపోయినపుడు మనకు తెలియదు చనిపోయామని కానీ ఆ మధ్యలో కాస్త జ్ఞానం వచ్చిన తర్వాత ఉంటుంది అసలైన నరకం.

కాకి లాగా మన జీవితంలో ఎలాంటి ప్రాముఖ్యత లేకుండా గడిపేస్తే ఏముంటుంది హంస నీటిలో ఉన్నప్పుడు దర్జాగా కూర్చుని ఉంటుంది కానీ నీటిలో తన కాళ్ళను ఆడిస్తూనే ఉంటుంది కానీ పైకి మాత్రం అసలు ఏం చేయనట్లు ఉంటుంది మనం కూడా మన జీవితంలో పని చేస్తున్నామని ఆ పని తాలుకు భారాన్ని అంతా ముఖంపై చూపిస్తుంటాం అలా చేయకుండా మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతూ వాటిని ఎదుర్కోవాలి.

చాలామంది మనకు చెబుతూ ఉంటారు తప్పు చేయకూడదని కానీ అసలు నిజం ఏంటంటే చిన్నప్పుడు క్రింద పడకుండా నడక నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరూ ఉండరు ఇక్కడ రచయిత చెప్పింది ఏంటంటే తెలిసో తెలియకో రోజులో ఏదో ఒక తప్పు చేసి ఉంటాం ఆ తప్పు వల్ల ఎదో ఒకటి నేర్చుకోవాలి అంతే కానీ తప్పు చేసేశామని ఏడుస్తూ కూర్చోకూడదు చేసిన తప్పు చేయకుండా ఉండాలి అలా అని తప్పులే చేయకుండా ఉంటా అంటే అది కూడా కుదరదు మనిషి అన్నాక ఎదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు చేసిన తప్పుని ఒప్పుకుని ఆ తప్పు నుండి ఎదో ఒకటి నేర్చుకుంటూ ముందుకు సాగిపోవాలి అంతా మనకే తెలుసు అనుకోవడం మన పొరపాటు జీవితంలో అంతా తెలిసిన మనిషి ఎవరూ లేరు ఉండరు అలా తెలిస్తే బ్రతకడానికి ఏం ఉండదు.

చాలామంది మనసుకు నచ్చిన పని చేస్తూ ఉంటారు ఎదో చేస్తున్నాం అంటే చేస్తున్నామని కానీ నువ్వు ఇష్టపడిన పని నువ్వు చెయ్యలేదు అంటే నీకోసమే ఉన్న పని నీ దగ్గరకు వచ్చింది అనుకోవాలి ఆ పని చేసి నువ్వు ఎంటో నలుగురికి తెలిసేలా చేయాలి అప్పుడే కదా నీ బలం ఎంటో నువ్వు ఎంటో ఈ ప్రపంచానికి తెలుస్తుంది.

చాలామంది వాళ్ళకి జరిగింది తలచుకుని బాధ పడుతూ ఉంటారు ఈ అందమైన లోకంలో మనకు తెలియనివి చాలా ఉన్నాయి వాటిని తెలుసుకోవాలి వాటిని చూస్తూ ఉండాలి పగలు రేయి గడిస్తేనే రోజు అంటారు అదేవిధంగా కష్టం నష్టం రాకుండా ఉంటే జీవితమే కాదు జీవితంలో అన్ని ఉంటాయి వాటిని ఆస్వాదిస్తూ ముందుకు వెళ్ళాలి.

అందరిలో మనం ఉంటే మన ఉనికి ఎక్కడ ఉంటుంది మనకోసం మనమే జీవించాలి అప్పుడే నీ జీవితానికి అర్థం ఉంటుంది అందరూ నడిచే దారిలో కాకుండా నీ గమ్యం ఎంటో తెలుసుకుని పయనిస్తే నువ్వు ఎంటో నీకు, ప్రపంచానికి తెలుస్తుంది నీకు పనికొచ్చే విషయాన్ని కష్టమైన చేసేయ్ నీకు అనవసరం అనిపించే పనులు చేయకుండా ఉండాలి గెలుపు నువ్వు పిలిస్తే వచ్చేలా కష్టపడాలి బానిసలా కాకుండా నీ జీవితానికి రాజులా బ్రతకాలి.

***ఇత్నార్క్***

You May Also Like

One thought on “ బ్రతుకు పోరాటం (పాట సమీక్ష)

  1. చాలా బాగుంది అండి.‌మంచి పాట. దానికి తగిన సమీక్ష👌👌☺️🌹🌹

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!