పచ్చి కుండ (కవితా సమీక్ష)

పచ్చి కుండ (కవితా సమీక్ష)

సమీక్ష: నెల్లుట్ల సునీత

కవిత: పచ్చి కుండ
రచన: డాక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి గారు

జీవీత దుఃఖ వ్యధితమైన కవి హృదయాంతరాళం నుండి వెలువడిన ఉరవడి… పచ్చి కుండ కవిత

కాలం కల తెగిందా…//
ఆయుష్ శీకటం పట్టిందా//
అని జీవిత ప్రయాణం ఆగిపోయింది అనే అర్థంలో మర్మగర్భంగా చెప్పారు.

బిందె కు మాటేస్తరు సరే
కుండకు పొట్కు వడ్తే ఎట్లా..?
దేహాన్ని వదిలి వెళ్లే ఆత్మను మళ్లీ తెచ్చి ఎవరు మాటేస్తారు అనే అర్థంలో చెప్పారేమో కవి గారి ఉద్దేశం.. అని అర్థమవుతుంది.

ఆత్మీయ బంధాలు అన్ని గాయపడుతున్నాయి. అని ఉద్దేశిస్థూ తల్లి, భార్య ,పిల్లలు, అందరూ బాధ పడుతున్నారు అని ఆవేదన
చెందుతారు.

పాలిచ్చిన రొమ్ము గాయబ్//
ముద్దిచ్చిన చెంప గాయబ్//
మెగ్గలేమన్న అగాధం దాటేస్తయంటే //
సముద్రంల అప్పుడే కాటగల్సినం//
ఎవరికి ఎవరు ఒక కలుసుకో లేరు
సముద్రంలో అప్పుడే కాటగలిసినం
అని ఆర్ద్రమైన వ్యక్తీకరణ పొందుతూ చెప్పారు. కవి గారు

దిగకముందెవ్వరూ చెప్పరైరి//
ఇదింత లోతుపాడైతదని /)
ఒడ్ఠుగనిపిస్తునే లేదు//
బుక్కెడు బుక్కెడు నీళ్ళు దాగి//
మునిగిపోతానా ఏంది//
ఈ చెట్టు మీద నాలుగు రోజులు //
వదలిపెట్టి చూస్తుండంటరు //
పంపినోడు కనపడ్త లేడు/)
రమ్మంటు దిక్కులేడు /)
సుట్టున్నోళ్ళంతా ఉత్తోల్లేనా //

ఈ బంధాలు ఎవి వెంటరావు, మృత్యు ను ఎవరూ ఆపలేరు కానీ ఆధ్యాత్మికంగా వారి కవితలో చెప్పారు.

జీవితాన్ని కరెంటు బల్బు తో పోలుస్తూ చిచ్చు బుడ్డి లాగా కొద్దిసేపు మాత్రమే వెలిగి ఆరి పోతుంది. అని జీవిత సత్యం ,లోతైన విశ్లేషణతో, ఎంతో ఆర్తితో, వేదనతో. వైరాగ్య సంపత్తితో తాత్విక చింతనల తీవ్రత. వ్యక్త పరిచారు.

ఎంత మునిగినా//
అడుగు తగలదు//
దీనికసలు అడుగుందా….//
అయినా/)
ఆటముగిసేదాక అల్తకొనొద్దు//
తోటిపిట్టల తోటి తొండిచేయొద్దు//
పోతే చెట్టే దిగులు పడాలి//
గుంపు చింత జెయ్యాలె//
పోవడం నిశ్చయమైతే //
తొవ్వల్లో ముళ్ళకంపలెందుకు //
ఇంతచిన్నపండు చితగొట్టడానికి//
అంత పొడగాటి కత్థి కావాలా తండ్రి //

పట్టి లాగితే ఊడే పండు //
తెంపివిసిరితే పోయే కాయ//
విరిస్తే విరిగే పూవు //
తడిమితే రాలే మొగ్గ//
నీతో సమానుడా //
పగబట్ట…!

జీవితంలో ఇలాంటి సంఘటన ఎప్పుడో ఒకరోజు అందరికీ తప్పకుండా వస్తుంది సంసింద్దతో ఉండమని మానసిక ప్రేరక శక్తిని నింపారు. పాఠకులకు

పచ్చి కుండ అనే శీర్షకతో జీవితాన్ని పోలుస్తూ పచ్చి కుండ పట్టుకుంటే ఎలా విచ్ఛిన్న మవుతుందొ అనే జీవిత అర్థాన్ని ఇచ్చారు.

మనం ఎవని గుద్దినా ఫట్//
ఎవడన్నా మనల్ని గుద్దినా ఫట్ //
దీనమ్మ జీవితం//
కుండలెక్క /)
బుగ్గలెక్క //
ఎల్లినట్టే ఎల్లి ఆరే //
చిచ్చుబుడ్డి లెక్క…!

చక్కని భావాలు కలిగి తెలంగాణ యాస, భాష కలిగి, ఆత్మానుభూతితో జీవితమంటే ఏంటో అనే జ్ఞానోదయం కలిగించారు కవిగారు.

జీవిత పరమార్ధాన్ని తెలిపిన మీ కవిత చాలా చాలా బాగుంది . మీ కలం నుండి ఎన్నో కవితలు జాలువారలని కోరుకుంటూ….అభినందిస్తున్నాను.

నెల్లుట్ల సునీత

You May Also Like

One thought on “పచ్చి కుండ (కవితా సమీక్ష)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!