దేవుడే నిన్నిలా ప్రశ్నిస్తే ?

దేవుడే నిన్నిలా ప్రశ్నిస్తే ?
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: శ్రీదేవిప్రభాకర్ తంత్రవహి

పువ్వులు పెట్టి, పూజలు చేసి పుణ్యం అంతా
వచ్చేస్తుందనుకున్నావా?
ఎన్నడైనా, పరుల కొరకు ప్రేమను పంచి,పరవశించావా?
దీపం పెట్టి, పుణ్యమంతా నాకే..నాకే అనుకుంటున్నావా?
దీనుల బ్రతుకులకు ఎపుడైనా వెలుగును పంచి, దారిచూపావా?
అహమును వీడి, నీ మదిని ఆర్తుల కొరకు, అర్పణ చేసావా?
చీకటి లాంటి అజ్ఞానాన్ని ఛీ.. కొట్టి తరిమావా?
దర్పము వదలి, దీనుల పట్ల దయతో మెలిగావా?
కష్టమిచ్చిన వారిని సైతం కరుణతో చూసావా?
నువ్వు క్షమతో చూసావా? క్షమించి చూసావా?
క్షమించ గలిగావా ?
అదీ, ఇదీ..కావాలని అడగడమేనా ?
అది..ఇదే.. ఇవ్వంటూ
అంటూ చేసే ఆగడమేనా ?
మారని ఓ మనిషీ !!
ఎప్పటికీ నీవు అంతేనా?
నీకు, నేను కూడా ఇంతేనా ?

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!