మానస

అంశం : సస్పెన్స్/ హాస్యం

మానస
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన : ఆకుమళ్ల కృష్ణదాస్

పండక్కి పట్టుచీర తేలేదని జుట్టుపట్టి లాగిందేమో.. సూర్యదేవుని సతీమణి, అరగంట ముందే వచ్చాడు అవని పైకి. వచ్చిన వాడు ఊరుకున్నాడా.. కిటికీ లోంచి దూరిమరీ చెవులు పిండుతున్నాడు తన పసిడి కిరణాలతో. మా రవిగాడి పోరు పడలేక ఎన్ని ఊర్లు తిరిగినా వాడికి తగినపిల్ల దొరకక.. నానా యాగీ చేస్తుంటే.. పక్కనే ఆరు కి.మీ.దూరమున్న అక్కుపక్షి పురానికి పోవాలని..హడావిడిగా తయారై.. ఉన్న నాలుగు జుట్టేంట్రుకలను ఆరుసార్లు దువ్వుకొని.. నేను మా రవిగాడు ఆటో స్టాండుకు వచ్చి నిలబడ్డాము.కారాకిళ్లీ నమిలిన గారపండ్ల వ్యక్తి..’ఎక్కడికెళ్లాలి సార్’ అంటూ ఆటో..దగ్గరికి తెచ్చాడు. ‘అక్కుపక్షి పురం’అన్నాను. గండభేరుండం పక్కనా అన్నాడు. అవును అని, రానుపోను బేరం కుదుర్చుకుని ఆటో ఎక్కి బయల్దేరాము. మీ పేరు సార్ అన్నాడు ఆటో వాడు.’గరుడాద్రి’అని చెబుతూ తొందరగా వెళ్ళమన్నాను. అమ్మాయి వాళ్ళింటికి చేరుకున్నాము. అమ్మాయి వాళ్ళ నాన్న సాదరంగా ఆహ్వానించి సోఫాలో కూర్చోబెట్టారు. నీపేరేమిటి అని అమ్మాయి ని అడిగా. ‘కలహంస’ అంది. పేరు బాగుంది అనుకున్నా.. అమ్మాయి కూడా బాగుంది. ఒక పాట పాడమన్నాను. బుల్లెట్టు బండి పాట పాడింది. వాళ్ళ నాన్న కూడా’బంగారు కోడి పెట్ట’పాట పాడాడు. మమ్ము కూడా’ నాటు నాటు'(RRR)పాట పాడుతూ.. డాన్స్ చేయమన్నారు. మావాడు పక్కా మహేష్ బాబు ఫ్యాన్.’కమాన్ కమాన్ కళావతి’ అని పాడుకుంటూ వచ్చి ఆటో ఎక్కాడు. అమ్మాయి చూస్తే’అరవింద సమేత'(NTR) ఫ్యాన్. ఈ సంబంధం కూడా కుదరదని.. తిరుగు ఆటోలో ఇంటికొచ్చాము. ఆటోదిగి అలా చూడగానే..’కాళ్ళు కడుక్కోండి మావయ్యా!’ అంటూ చెంబుతో నీళ్లిచ్చింది. ‘ఎప్పుడొచ్చావు మయూరి’అన్నాను. కొద్ది సేపయ్యింది మావయ్యా అంది. హమ్మయ్య! మా వాడికి పిల్ల దొరికింది అనుకున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయి మా వాడికి మేనమామ కూతురు.
ఇన్నాళ్లూ ఆ విషయమే మరిచిపోయాను మరి!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!