భగనీ హస్తం

భగనీ హస్తం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

                                                                                                                                                       రచన: పి. వి. యన్. కృష్ణవేణి

సమీక్షకులు: పి. వి. యన్. కృష్ణవేణి

తల్లిదండ్రుల ప్రేమతో సమానంగా పోల్చుకునేది తోబుట్టువుల ప్రేమ. కష్టంలో నేను ఉన్నాను భరోసానే తోబుట్టువులు. ఏది అయినా ఇచ్చిపుచ్చుకోవడానికి, మనసులో ఉన్న ఆనందాన్ని, మనసులో ఉన్న వైఫల్యాన్ని వీళ్ళతో పంచుకొని మనసు భారం తగ్గించుకోవచ్చు. కలసి తినడంలో ఆనందం, చిలిపి చేష్టల్లో సంతోషం, గిల్లికజ్జాలలోని గిలిగింతలు, మనసులకు ఉండే ఎన్నో ఆరాధనలు, ఆప్యాయతలు. పురాణాల్లోని అత్యద్భుత భావ కల్పనలే ఈ నా కవితలో రూపం దాల్చాయి. కొన్ని పారుతున్న వరదలులాంటి ఈ మనసున పిండేసే బాధలకు ఆనకట్ట తోబుట్టువుల బంధం.

కలసికట్టుగా చేసే సందడి భోజనాలు
ఎగిసి పడే నిలువెత్తు కెరటాలు
ప్రేమకు అవే ప్రతీకలు
నింగియే హద్దుగా మారే ఆ నిమిషాలు
రకరకాల పిండి వంటలు కాదుగా
మది నిండా అన్న రూపం ఉంటుందిగా
విందు అనేది నోరూరించుతుండగా
అక్క మనకై వేచి ఉండదా ప్రేమగా
గిల్లిఖజ్జాలే మనకు తీపి గుర్తులు
మదిలో అలునుకున్న చీకట్లు
మరిపించునులే చిలిపి తగాదాలు
నెమరువేసుకునే తీపి జ్ఞాపకాలు
అక్క చేతి ముద్ద అమ్మను మరిపిస్తుందిగా చెల్లి పెట్టే ఆ బుంగమూతి అందంగా
చెక్కిలగిలి పెట్టేనులే మురిపెంగా
ఈ ఆనందాలే మనకు పంచును
ఆప్యాయంగా

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!