కిరాణా వ్యాను

 కిరాణా వ్యాను

రచయిత:: నారు మంచి వాణి ప్రభాకరి

సూర్యుడు భగ భగ మండు తున్నా డు ఆ సమయం లో గ్రామ వలెంటేర్ ఫోన్ చేసింది
బియ్యం కంది పప్పు పంచదార ఇచ్చే వ్యాన్
వచ్చింది రండి కిందకి అని పిల్చింది చాలా రోజులకు దేముడు లాంటి ప్రభుత్వం వల్ల అందరికీ రేషన్ కార్డులు వచ్చాయి సా ఇంట్లో ఎవరూ ఉద్యోగస్తులూ లేరు పెన్షన్ వారు లేరు కొత్త ప్రభుత్వం ధర్మమా అని రేషన్ కార్డ్ హెల్త్ కార్డ్
పెన్షన్ అన్ని గుమ్మలోకి వచ్చి ఇచ్చారు ఎంత గొప్ప
పని చేసిన నాయకుని అంతా మెచ్చుకున్నారు.
వీధి గుమ్మంలో కి వచ్చిన అన్న పూర్ణ అంటూ వెళ్లి బియ్యం పప్పు పంచ దార తెచ్చుకుని కళ్ళ కి అద్దుకుని మరి పుచ్చుకున్నారు
కార్డు ఉన్న అందరూ బీద బిక్కి తార తమ్యం లేకుండా చక్కగా ఇష్టంగా వెళ్ళి ఎలక్ట్రానిక్ వెలి ముద్ర వేసి సరుకు లు తెచ్చుకున్నారు.

వండుకునే విధానం కూడా వేరేగా ఉందని చెప్పారు
రంజిత తల్లి నీ అత్తగారిని పెట్టుకుని వంట వార్పుకు మనిషిని పెట్టుకుని కాలం గడుపుతోంది భర్త సౌదీలో ఉన్నాడు పిల్లలు హాస్టల్ లో ఉన్నారు
పెద్ద వాళ్ళని చూస్తూ రంజిత ఉన్నది

మొత్తం మీది నల్గురుకి ప్రతి సారి ఇరవై కేజీలు ఇచ్చేవారు ఈ సారి మనిషికి పది కేజీ లు కాప్పున ముప్పయి కేజీల బియ్యం వచ్చాయి

ఆ చుట్టుపట్ల వాళ్ళు అంతా వచ్చి బియ్యం కోసం ఎగబడుతున్నారు ఇంత వరకు బియ్యం కొనుక్కుని తిన్నారు ఇప్పుడు వీరు ఇచ్చే బియ్యం కూడా చాలా బాగుంటుంది పప్పు బాగా ఉడుకుతుంది పంచదార తీపి సరే సరి
ప్రజలు ఆనందంగా క్షేమంగా ఉంటే ప్రభుత్వం
ఉన్నతి లో ఉన్నటే కదా

మంత్రి పదవి లోకి రాగానే చక్కని ఆలోచన సామాన్యులు కడుపు తడిమి పట్టెడు అన్నం పెడుతున్నాడు అదే శ్రీ రామరక్ష అని ఎంతో.మంది బామ్మలు దీవిస్తునే ఉన్నారు

ఏ మనిషికి అయిన టైమ్ కి ఉదయం కాఫీ
ఉండాలి అల్పాహారం ఉండాలి
మధ్యాహ్నం భోజనం ఉండాలి పచ్చడి పులుసు
లేదా కూర పులుసు ఉండాలి
రాత్రి కొంచెం పచ్
కొంచెం పచ్చడి ఉండాలి ఎంత ధన వంతు కైన ఆహారం తప్పని సరి ఈ నాడు హోటల్స్ లేవు.
తప్పని సరిగా ఇంట్లో వండుకుని తినాలి
అప్పుడే కంచంలోకి భోజనం చేసి హాయిగా జీవించడానికి మనిషి సరుకులను జాగర్త గా వండుకోవాలి
వంట కూడ ఒక కళ చాలా మంది కిరాణా షాపు
బిల్లు తక్కువ అవుతోంది బెల్లం చింత పండు
ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వంటి వాని ఖర్చు
అనంత మాత్రం బియ్యం పప్పు అధిక ఖర్చు అని
చాలా మంది సంతో షించ్చారు

వాలెం ట రీ వచ్చి వెలి ముద్ర పడని వాళ్ళకి అమె వెలి ముద్ర వేసి బియ్యం ఇచ్చేది
కొందరు బామ్మల కి వయసు రీత్యా రేఖలు అరుగు పోయాయి
పనులు వల్ల కొందరికి రేఖలు అరిగి పోయాయి
అయినా ప్రభుత్వం వారు అందరికీ అన్నం పెడుతున్నారు ఆ అన్న పూర్ణ పెట్టిన పుణ్యం ఊరికే పోదు కదా సర్వే జనా సుఖినోభవంతు
అనంత చిన్నప్పటి నుంచి స్వతహాగా నెమ్మది ఒక్క కొడుకు ఆడబిడ్డలు లేరని
అన్న వదిన కుదిర్చి పెళ్లి చేశారు
అమ్మ నాన్న మాట ప్రక్కన బెట్టి చెల్లిని బి ఎ చదివించారు ఆ వచ్చేవాడు ఎలాంటి వాడు అయిన తన బ్రతుకు తను బ్రతుకు తుంది ఇప్పటి రోజుల్లో ఆడపిల్ల పెళ్లి మాటలు వేరు పరిస్తితి వేరు గా ఉంటుంది కనుక డిగ్రీ చెప్పించి పెళ్లి చేశారు రెండు పురుళ్లు పోశారు
అక్కడితో ఆడపిల్ల జీవితం పుట్టింటికి పులిస్తాప్ పెట్టేయాలి కష్టం సుఖం అత్తింటి లోనే అంతా చూసుకోవాలి.అందుకే అనంత
స్వశక్తి పై జీవించాలి అన్న ధ్యేయం తో పుట్టింటి వారికి బరువు కాకుండా ఉన్నది

మాధవుడు మాత్రం పెళ్ళాం ఉద్యోగం వచ్చి నందుకు సంతోష పడ్డాడు అనెను ఎండ పడకుండా జాగ్రత్తగా స్కూటరు పై తీసుకుని వెడతాడు

వేసవి కాలం వచ్చింది బియ్యం వ్యాను ఎక్కడికి వస్తె అక్కడికి వెళ్లి నుంచుని వారి కార్డ్స్ పరిశీలించి బియ్యంలెక్క ప్రక్రం
ఇప్పించాలి

ఒక అప్పర్మెంట్ నాలుగవ అంతస్తు లో ఒకనే ఉంది అనెను కూతురు దగ్గర ఉండి చూస్తుంది భర్త పిల్లలు విదేశాల్లో సెటిల్ అయ్యారు అమె తల్లిని చూడటం కోసం ఇండియా వచ్చి తల్లి దగ్గర ఉంది భర్త కొంత కాలం ఉండి వెళ్ళాడు మళ్లీ అక్కడ రిటైర్
మెంట్ దగ్గరపడింది అరు నెలల్లో ఇండియా వస్తాను అంతా వరకు నువ్వు చుడు అని పెట్టీ వెళ్ళాడు కొడుకులు
వేరే స్టేట్ లో ఉన్నారు
ఆమెకి వృద్ధ పెన్షన్ తెచ్చి ఇస్తు ఉంటుంది అనంత. కి పళ్ళు అవి ఇస్తుంది అన్నం తిన్నవ్వా తింటావా పెట్టనా అంటుంది
కానీ వద్దు అని అనంత మొహమాట పడుతుంది.
అందరికీ రేషన్ పెన్షన్ ఇచ్చాక
భర్త వచ్చి తీసుకుని వెడతాడు
మాధవుడు మంచి వా డు అని
అంటుంది.

ఒక రోజు పని పూర్తి కాలేదు ఒక అపార్ట్మెంట్ వద్ద రేషన్ వ్యాన్ రాలేదు టైమ్ లేక భర్త కి అన్నం బాక్స్ తెమ్మని ఫోన్ చేసింది పై వరకు వెళ్లి కూచుంది
మేము ప్రతి ఒక్కరికీ బియ్యం పప్పులు అందివ్వాలి అది మా ఉద్యోగ ధర్మం అంటుది
అనంత బి ఎ చగివింది డిగ్రీ కాగానే పెళ్లి చేశారు ఎదో చిన్న బిజినెస్ రెడీ మేడ్ బట్టల షాప్
పెద్ద పెద్ద దుకాణాలు ఉన్నాయి
ఎవరు ఈ చిన్న కొట్టుకి వస్తారు ఈ రోజుల్లో మందులకొట్టు కిరాణా కొట్టు తప్ప మిగిలినవి అంతంత మాత్రమే అందుకే
ఇది ఒకరకంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా అనే తృప్తి

సూర్యుడితో పాటు పరుగు ఒక్కొక్క సారి సర్వర్ పని చెయ్యదు అలాంటప్పుడు తెల్ల వార గట్ల వచ్చి మనుషుల్ని లేపి డబ్బు ఇచ్చి వెడుతుంది శ్రీ మహా లక్ష్మీ .మళ్లీ ఇంటికి వెళ్లి స్నానం పూజ చేసి వంట వండి
ఇద్దరు పిల్లలు వృద్ధ అత్తగారు వాళ్ళకి అన్ని చూసి మళ్ల పదిగంటలకు డ్యూటీ కి వస్తుంది . ఒం టీ గంట వరకు అన్ని చూసుకుని భర్తకి ఫోన్ చేస్తే అతను అనంత లక్ష్మి ఎక్క డా ఉంటే అక్కడకి వస్తాడు
స్కూటర్ ఎక్కించుకుని వెడతాడు భార్య భర్త కలిసి జీవించడానికి కావలసిన విధంగా ధైర్య సాహసాలు ఉండాలి కుటుంబంలో భార్యను గౌరవించి అమె ను ప్రేమగా చూస్తుంటే కుటుంబ పోషణ అంతా అనంతే చూసుకుంటుంది అమ్ముడు అవుతాయి అవవు అయినా పురుష లక్షణం కనుక బిజినెస్ చేస్తాడు మాధవుడు ఒక్కడే కొడుకు కావటం వల్ల తల్లి బాధ్యత పడింది ఏదైనా హోమ్ లో పెడదామంటే అనంత వారిం చింది.

మనకి ఇద్దురు కొడుకులు వాళ్ళు పెద్ద వాళ్ళు అయ్యాక పంచుకుంటే ఏమి చెయ్య గలవు నువ్వు ఒకచోట నేను ఒక చోట ఉండాలి అందుకు మనం వాళ్ళకి ఈ లాంటి ఆలోచన రానివ్వ కూడదు
కలో గంజో మనమే పెడదాము అని వారించింది
అన్నం బాక్స్ విప్పుకుని తినే లోగా వాచ్ మాన్ వచ్చి ఇక్కడ తింటే వప్పు కొరు నువ్వువెళ్ళిపో అని కసురు కొన్నాడు అక్కడ ఎన్మందుగురుకి రేషన్ ఇవ్వాలి
అయినాసరే వాచ్ మాన్ కటినంగా మాట్లాడాడు

అనంత మనసు నో చ్చుకుంది
ఇంకా నయం భర్త లేడు వెళ్ళి పోయాడు అనుకుంది

వాళ్ళ పనిమీద అక్కడ ఉన్నా సరే తన అన్నం తనని తినివ్వక
పోయారు అనుకుని బాక్స్ పుచ్చుకుని మళ్లీ నాలుగవ అంతస్తు లో బామ్మ ఇంటికి వచ్చింది

బామ్మ అని పిలిచింది

ఏమ్మా ఎండలో వచ్చావు
నీ పని పూర్తి కాలేదా అందరికీ
బియ్యం పప్పులు ఇంకా ఇవ్వడం అవ లేదా అన్నది

లేదు బామ్మ అంటూ విషయం చెప్పింది

అయ్యో నువ్వు ఎప్పుడూ ఎక్కడ తీనకు అన్నం తేకపోయిన నేను పెడతాను అని అడిగింది

కూర్చో బ్యాక్లో ఎందుకు తినడం అంటూ ఆకు ఇచ్చింది కూర కొత్త అవ కాయ వేసింది అనంత మొగుడు మజ్జిగ బాటిల్ లో తెచ్చాడు
అన్నం ఎదో పచ్చడి వేసి తెచ్చాడు
ఈలోగా బామ్మ కూతురు ఫ్రిజ్ లోంచి
బాక్స్ తెరిచి అన్నం బామ్మ ఇచ్చిన కాగితం పళ్ళెంలో పెట్టుకుని పచ్చడి వేసుకున్నది
ఈ లోగా బామ్మ కూతురు సౌజన్య వచ్చి మామిడి కాపప్పు కొత్త అవకయా వడియాలు తెచ్చి వేసింది మంచి నీళ్ళు ఇచ్చింది కొంత పెరుగు కూడా తెచ్చింది వద్దు అమ్మ మజ్జిగ తెచ్చాడు అన్నది అది నీ బ్యాగ్లో పెట్టుకుని ఈ పెరుగు వేసుకో అని పక్కన పెట్టింది.

సరే అంటూ మోగ మాటం గా తిన్న ది ఇప్పటి కిప్పుడు మీకు
కష్టం కదా వండుకు. న్నది నాకు పెట్టేస్తున్నారు అన్నది

మా ఇంట్లో ఎప్పుడూ ఒక్ మనిషికి ఎక్కువ వండి ఉంచుతా ము కూడా అందుకే ఎవరు వచ్చినా పర్వలేదు పెట్టగలము
ఈ విశ్వంలో స్త్రీ కుటుంబ రక్షణకు ఆత్మ విశ్వాసంతో
పోరాడుతుంది తను తినన తినక పోయినా తన పిల్లలు తినాలని ఆశ పడి వాళ్ళ కోసం
కష్ట పడుతుంది. భర్త తో కలసి
కుటుంబ ఉన్నతి పొందాలి అని
ఎంతో కష్ట పడుతుంది

భర్త తన కోసం కొట్టు.వర్కర్ పై వదిలి వస్తున్నా డని బాధపడి
సెకెండ్ హ్యాండ్ స్కూటర్ కొనుక్కొని నేర్చుకుంది.

కిరాణా వ్యాన్ పని అయ్యేవరకు తను వెంట ఉండి అందరికీ బియ్యం పప్పులు తక్కువ ధరకు ఇవ్వాలి కార్డులు వెలి ముద్రలు అన్ని సరి.చూసుకోవాలి జనం ఎవరి ఖంగారు వా రిధి .
ఎవరో ఒకా మే వీటి తో పాటు
ఎండు మిర్చి చింతా పండు నూనె బెల్లం అట పిండి కూడా ఇస్తే బాగుండును అని తన అభిప్రాయం ప్రకటించింది

ఇంకో ఆమె ఉల్లిపాయలు రెండు కూరలు కూడా ఇస్తే ఇంకా బాగుండును అన్నది

మరో చదువుకున్న అమ్మాయి వచ్చి నేను పిహె చ్ డీ చేశాను
వేలిముద్ర వెయ్యాలి అంటారు
మరి రాత్రి పగలు కాస్త పడి చదివిన చదువు ఏమియ్యింది
కొన్నాళ్ళు రాత్రి బడులు పెట్టారు సంతకం కోసం మళ్లీ
భూమి గుండ్రంగా ఉన్నదని తెలుస్తూ ఎలక్ట్రానిక్ మిషన్ పై
వెలి ముద్రలు వచ్చాయి
పరిస్తితి తిరిగి అదే స్థాయికి
వచ్చింది పెద్దల మాట సద్ది మూట కదా అని నవ్వింది

బియ్యం కొలిచే కుర్రాడు నవ్వుతూ నేను బియి చేశాను
ఈ జాబ్ కి వచ్చి బియ్యం కొలుస్తున్నను విద్యతో ప్రగతి
వచ్చినా కొంచెం మార్పులతో
పాత విధానాలే. వచ్చాయి

మన తాత ముత్తాతలు వెలి ముద్ర పసర్లు ఇంకులలో వేస్తే మనం ఎలక్ట్రానిక్ మిషన్ పై వెలి ముద్ర వేస్తున్నారు తప్పదు
పెద్దల అఙ్ఞాలు మనం ఆచరించాలి అని నవ్వాడు

అనంత శ్రద్ధ గా అన్ని విని నవ్వుకుంది వ్యాన్ పని అయ్యాక జాగ్రతగా లీస్ట్ చూసుకుని తన స్కూటర్
స్టా ర్ట్ చేసి వ్యాన్ వెనుక వేరే విధికి బయలు దేరింది తన కర్తవ్యం బాటలో విజయం కోసం తేనెటీగ లా శ్రమించే
మనస్తత్వమున్న మహిళా నీకు జోహార్లు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!