ఆనాటి ముచ్చటలు ఎన్నయినా గురుతొస్తాయి

ఆనాటి ముచ్చటలు ఎన్నయినా గురుతొస్తాయి

రచన: కృష్ణకుమారి

విల్లూ బాణం పట్టని విద్యార్థే ఉండేవాడు కాదు, ఇంటింటికీ తిప్పి
దసరా పాట పిల్లలచేత పాడిస్తూ దసరా కట్నం అడగని పంతుళ్ళూ
ఉండేవారు కాదు..

పులివేషం డప్పులు వస్తే పెద్దలకీ పులకింతే, పిట్టలదొర కబుర్లకి
వంటింట్లోంచి వచ్చి వినే గృహిణులు, కొంగుచాటు చేసుకొని నవ్వే బామ్మలూ

కలకత్తాలో చేసిన కాళీపూజ రావణ దహనం దశదిశలా పాకేది!
ఆడపిల్లల‌ ముంజేతికి మీసాలు మొలిపించేది!

అమ్మవారి‌ పూజకి ప్రసాదాల తయారీతో
ఇంటింటా ‘ఘుమ ఘమ’ నాన్నలు చదివే నమకం చమకం, తాతలు
ఇచ్చే కొత్తబట్టలు! దసరా అంటే నవరాత్రుల సరదా పండగ!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!