ఊపిరికి ఉరి

ఊపిరికి ఉరి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: యువశ్రీ బీర

ఊపిరి పోసుకోబోతున్న వేళ.
ఊపిరందనివ్వలేదు.
ఉక్కిరిబిక్కిరై ఊసురోమంటూ
ఊపిరొదులుతుంటే
చేతులు దులుపుకొని ఊపిరి పీల్చుకొనేది ఎందరో
పసిగుడ్డును చిదిమేస్తూ
పాపం మూటకట్టుకొని
జల్సాగా తిరుగుతున్నారు కొందరు
కోర్కెలు పురివిప్పినపుడు
మనసును అదుపుచేయలేక కొందరు
వయసు వలలో కైపు కదలికలతో మరికొందరు
కామవాంఛ కట్టలు తెంచుకొనే
కామాంధుల చేతిలో నలిగి ఇంకొందరు.
కారణమేదైనా జరుగుతున్నవి మాత్రం భ్రూణహత్యలు
చీమకైనా హానిచెయ్యలేని మనసున్న మగువ.
చీకటిలో చేసిన పనికి..
రూపాన్నిచ్చి వెలుగును చూపలేక.
గోప్యానికి తావులేని తరుణంలో
తన తనువును తప్పుపట్టకుండా
తనలో పెరిగే ఊపిరికి ఉరివేస్తున్నారు
కడుపులో పడ్డ ప్రాణానిదా ఆ నేరం…?
ఎందుకు చేయాలి అంత ఘోరం…?
ప్రాణంతీసే హక్కు ఎవరికీ లేదు
వీలైతే ప్రాణంపోయండి
లేదంటే మీ చీకటి చిందులాపండి.
కానీ పసి ప్రాణాలతో ఆటలాడకండి.!

You May Also Like

One thought on “ఊపిరికి ఉరి

  1. Excellent madam.ఇప్పుడే మీ కవిత చదివాను స్త్రీ యొక్క గొప్పతనం గురించి చాలా బాగా సారు అభినందనలు మేడం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!