నిలువు దోపిడీ

(అంశం – మానవత్వం ముసుగులో వ్యాపారం)

 నిలువు దోపిడీ

రచయిత: V. కృష్ణవేణి

నిలువెత్తు మనిషికి ప్రతిరూపంగా
నిలిచింది దోపిడీ
ఎక్కడుంది మానవత్వం
అంతా సంపాదన వ్యామోహం వ్యాపారం
డబ్బు మయమే తప్ప
జబ్బు నయం లేనేలేదు.
ప్రగతి వైపు ప్రయాణించేది ఎవరు
ప్రతిభ కలవాడా  కాదు డబ్బుకలవాడే!
మనిషి మనిషికి సహాయం లేదు
సాటిమనిషికి అండగ నిలిచిందిలేదు
అన్ని అభివృద్ది లో ఉన్నా మనిషికే లేదు
సహాయం సహకారం
ఇంక మూగా జీవాలకు ఏముంటుంది రక్షణ.
బ్రష్టపట్టిపోయిన సమాజం
బీటలు వాడుతున్న మానవత్వం!
లోకం తీరేవేరు
అంతా నాది అనుకోవడము తప్పా!
చేయూతనిచ్చే నాధుడే లేని లోకం
భరోసా ఇచ్చే మానవత్వం కరువైన వైనం!
క్రుళ్లిన మానవలక్షణాలు తెగిన బంధాలు
మంచితనం అనే భ్రమ కల్పించి మొహం చాటేస్తున్న సేవాసంస్థలు..
మీకున్నామని మాటలు తప్పా చేతలు కరువు
ఆదుకుంటామని ఆక్రమార్కులు శబదాలు
తిరిగి చూస్తే కనుమరుగే….
ఎటుచూసిన  చేయూత లేని స్వచ్చంద సంస్థలు..
ఎక్కడ చూసిన మోసాలా ప్రభంజనం…!
ఇంకెక్కడిది అంతా కనికరం, జాలి లేని సమాజం అంతా మానవత్వం చాటున వ్యాపారం తప్పా…!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!