చిరు భరోసా

చిరు భరోసా

రచయిత :: బొడ్డు హారిక

ఏ ఊరు లో చూసిన, ఏ వీధిలో చూసిన కరోనా కేసుల కల్లోలమే…., మా ఊరిలో సక్కనైన సుక్కలాంటి చలాకియైన ఓ అమ్మాయి ఉంది, తన పేరు స్వప్న, తను చదివేది తొమ్మిదవ తరగతే అయినా సరే తన ఎంతో అభ్యుదయ భావాలు కలది, అందరి కోసం ఆలోచించేది.

ఈ ఆలోచనలు నీకెల వస్తున్నాయి అంటే, మా పాఠశాలలో మా సోషల్ టీచర్ ( జాస్మిన్ టీచర్ ) మాకు పాఠాలతో పాటు చరిత్రలో ఎందరో వీరులు అందరి కోసం ఆలోచిస్తూ ఆనందాన్ని పంచారని, మీరు కూడా అందరికీ కాకపోయినా కొందరికి అయిన సహాయం చేస్తూ, సంస్కారాన్ని ఆభరణంగా మలచుకోవాలని చెప్పారు అంటుంది.

ప్రస్తుతం కరోనా వలన ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు.
స్వప్న వాళ్ళ అమ్మ గారు ప్రతి రోజు వాళ్ళ ఇంట్లో ఆవు పిడకల పొగను ఉదయం సాయంత్రం కూడా వేస్తారు, ఎందుకమ్మా అని అడిగితే వాళ్ళ అమ్మ గారు ఆవు పిడకల పొగను వేయడం ద్వారా కరోనా వైరస్ ను 12 గంటల వరకు అదుపు చేయవచ్చు అని చెప్పారు.

అది విన్న తర్వాత స్వప్న కి ఒక ఆలోచన వచ్చింది, అమ్మా ఆవు పిడకల పొగను మన ఇంట్లో వేస్తే మనం మాత్రమే బాగుంటాము, అదే వీధిలో వేస్తే అందరం బాగుంటాము కదా అంది, అందుకు వాళ్ళ అమ్మ గారు అవును రా కానీ దానికి ఎవరు ఒప్పుకుంటారు అంది, అప్పుడు స్వప్న అమ్మా ముందుగా మనం మన వీధిలో ఉన్న వారితో మాట్లాడి నా వయస్సు పిల్లలం ఉన్నాం కదా మేమందరం ఉదయం 5 గంటల 30 నిముషాలకు లేచి, మొత్తం పది మంది ఉన్నాం కాబట్టి పది బకెట్లు లో ఆవు పిడకలు పొగ పెట్టి మన పేటలోని వీధుల్లోకి వెలితే పరోక్షంగా అయిన ప్రజల రక్షణ లో పాలుపంచుకున్నట్లవుతుంది కదా అమ్మా అంది, వాళ్ళ అమ్మ గారు హ అవును రా సరే మాట్లాడుదాం అని అందరితో మాట్లాడుతారు.

అందరూ కూడా డబ్బులు వేసుకుని ఆవు పిడకలు కొని ప్రతి రోజు ప్రతి వీధిలో తిరికుతున్నారు, అలా మూడు రోజులు గడవగానే, ఎవరి వీధిలో వారు పొగ వేసుకోవడం మొదలుపెట్టారు, అప్పుడు నుంచి అందరూ పొగ వేసుకుంటూనే జాగ్రత్తలు పాటిస్తూ ఉంటున్నారు, ఈ విధంగా చేయడం వలన మా పేటలో కేసులు తగ్గుముఖం పట్టాయి.

ఈ విధంగా అందరూ కలిసి అనారోగ్యాన్ని అడ్డుకుంటే అందరం ఆనందాన్ని పెంచుకోవచ్చు కదా, అందుకే కరోనా సోకిన వారినైనను కష్టాలకు వదిలేయక, మనం జాగ్రత్తలు పాటిస్తూ, వారికి జీవితానికి భరోసాగా నిలుద్దాం, మన భారతదేశాన్ని కాపాడుకుందాం……

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!