జీవితంలో ఎదగాలి
రచన: రంగ నరేష్ గౌడ్
జీవితంలో విజయం పొందాలంటే
ఓటమిని ఓడించాలి
అనుమానాలను ఎదిరించాలి
అనుమానాలను భరించాలి
పడిలేవాలి లేచి నిల్చోవాలి కానీ
గాయాన్ని చూడకు గతాన్ని గుర్తించుకో
గమ్యాన్ని నీ ఆయువుపట్టుగా నిలుపుకో
రేపటి విజయానికి నీలో కసి రగిలించుకో
ఫలితం దక్కాలంటే
పచ్చని చెట్టు కింద పరుపు
వేసుకోవటం కాదు
చెమట చుక్క చిందించాలి
అది విరబూయాలని సువాసనై
నీ జీవితానికి రాజు నువ్వే
సైన్యం నువ్వే
నీ జీవితంలో ఎవ్వరు వెలుగులు పూయించారు
నీ జీవితానికి నీవే వెలుగులు పూయించుకోవాలి
ఆ వెలుగులతో నలుగురికి బాటసారిగా మారాలి
ఎవరికోసం ఎదురుచూడకు
ఒకరి సహాయం కోసం అస్సలు ఎదురుచూడకు
అలా చూస్తే నీది జీవితమే కాదు
ప్రశ్న నీదే సమాధానం ఇదే