గండభేరుండ పక్షీ

గండభేరుండ పక్షీ

రచన : యాంబాకం

ఒకసారి పక్షులు అన్ని ఉనికి గురించి ఆరాతీసి “అడవిలోని జంతువులన్ని కలసి రాజు సింహం” అని నిర్ణయించు కొన్నాయి. కానీ మా “పక్షి జాతికి రాజు ఎవరు”? అని
ప్రశ్నించుకొన్నాయ్?అన్నిజాతుల పక్షులు కలసి ఒక్క సారి పైకి ఏగిరి బ్రాహ్మ లోకం లో వాలాయి కిల కిల గలగల అంటూ ప్రార్థించాయి.కొంతకాలంగా బ్రహ్మదేవుడు నిద్రలో ఉండటం వలన పక్షులకు బ్రహ్మదేవుడు అనుగ్రహం దొరకలేదు.ఇంతలో భూలోకం నుండి ఋషులు తపస్సులు,రాజులు,చక్రవర్తులు,వారితో పాటు భూమాత తో సహ బ్రహ్మలోకానికి రానేవచ్చారు.భూమాత తేజం విరజల్లగా బ్రహ్మదేవుడు నిద్రా అవస్థ నుండి కళ్ళు తెరిచాడు.మీ అందరి రాక కు కారణం ఏమిటో అని ప్రశ్నించాడు.

ముందుగా వచ్చిన “పక్షులు స్వామి.జంతువుల కు సింహం రాజు.మరి మా పక్షులకు రాజు ఎవరో సెలవు
వివ్వండి”అనగా,బ్రాహ్మ భూలోకం నుంచి వచ్చిన మానవుల కేసి చూసి భూమాత తమరు రాక కు కారణరం”! అన్నాడు బ్రాహ్మదేవుడు భూలోకం లో నాగులు ఎక్కువగా సంచరిస్తూ ఉన్నాయని,భూమిమీద అడుగు అడుగున నాగులు విచ్చలవిడిగా తిరిగి మానవుల మనుగడకు భగం కలిస్తున్నాయి. వాటి బాధ వల్ల మానవులు భయంతో వణికి పోతున్నారనీ,అంతేకాక ప్రాణులను కాటు వేసి చంపుతున్నాయనీ, దానికి పరిష్కారం చూపాలని అడిగారు వచ్చిన మానవులు భూమాతతో కలసి.

బ్రహ్మ దేవుడు,భూమాతను భూలోక వాసులు లను అభయం ఇచ్చి పంపివేసి, పక్షుల కేసి చూసి మీలో ఏ పక్షి అయితే నాగులను భక్షించి భూలోకం లోని నాగుల బాధ లేకుండా చేస్తారో వారే పక్షులకు రాజు అని ధీవించాడు.

పక్షులు అప్పటి నుంచి విధిగా నాగులను భక్షించటం మొదలు పెట్టాయీ. ఇలా కొంత కాలానికి భూలోకం లో నాగుల జాతి క్షీనించసాగింది. “అప్పుడు నాగులు అన్ని కలసి పరమశివున్ని ఆశ్రయించగా! శివుడు నాగులు మీకు వచ్చిన ఆపదయేమనగా పక్షిజాతి మామీద పగభూని మాజాతిని భక్షిస్తున్నాయి స్వామి” మాజాతిని కాపాడే భారం మీదే స్వామి అందుకు మేము నీకు సేవలు చేసుకొంటాము అని భక్తి పూర్వకంగా వేడుకున్నాయి.

శివుడు సరే నేను అభయం ఇస్తున్నా మీ నాగులజాతి కోసం పాతాళం లోని నాగలోకం సృష్టి స్తాను. అక్కడ మీరు మానవులకు కంటపడకుండా జీవిచండి అని శివుడుచెప్పి మాయమైపోయాడు.

అప్పటి నుండి నాగులు పాతాళం లో దాగి సుఖంగా జీవిస్తున్నారు.కానీ ఈ పక్షి జాతుల లో రాజు ఎవరు? అనే విషయం అలాగే ఉండి పోయింది.ఇది ఇలా ఉండగా “పక్షి జాతిలో శ్రేష్టుడు అయిన గరుత్మంతుడు. మాత్రం నాగుల మీద పగపూనాడు. మారువేషం లో “గండభేరుండ పక్షి”గా మారి వెతకసాగాడు,,పక్షులకు రాజు అవ్వాలన్నదే గరుడి ఆశ. ఇది ఇలా సాగుతూఉండగా,
మాతలి అనే ఒక దేవతుడికి గుణకేశి అనే కూతురు,ఆమె అపురూపవతి.గుణకేశికి యుక్తవయసు రాగానే ఆమెకు సరిఅయిన అందగాడు ఏ లోకంలో ఉన్నా వెతికి వివాహం జరిపించాలని అలోచించాడు మాతలి.

మాతలి దేవేంద్రుడు కి రథసారథి అందుకే అతనికి తగిన అల్లుడు ని తెచ్చుకోవాలన్నదే మాతలి కోరిక.

స్వర్గలోకంలోను, భూలోకం లోను, ఇలా అన్ని లోకాలలోను
వరుడు కోసం మాతలి వెతకసాగాడు ఆమె కు తగిన యువకుడు కనపడలేదు.

మాతలి భార్య “ఒకసారి పాతాళం లోని నాగ లోకంలోకి వెళ్ళిరండి”అని చెప్పింది. “సరే అని నాగలోకానికి బయలు దేరాడు మాతలి తన భార్య సలహామేర”! మాతలి వెలుతూవుండగా “దారి మధ్యలో నారదుడు” ఎదరై పలకరించి “అరె!ఇంద్రదేవుని సారథి మాతలి గా వుంది”! అనగా మాతలి నారదముని కి నమస్కరించి. తను తన కూతురి కి తగిన వరుడు కోసం వెతుకుతున్న విషయం అంతా వివరించి చెప్పాడు. అంతా విని నారదుడు.

నేను”ఇప్పుడు వరుణి దేవుడు నివాసం కు వెళ్ళు తున్నాను. వానలు లేక భూలోకం లో మానవులు గగ్గోలు పెడుతున్నారు. నీవు నా వెంట వస్తే అలోకంలో నీ కుమార్తె కు తగిన వరుడు దొరకుతాడేమో చూచుకోవచ్చు!? అన్నాడు. నారదుడు.

మాతలి సరే అని నారదుడి వెంట బయలు దేరాడు. మాతలి నారదుడు కలసి వరుణిదేవుడి ని కలసి భూలోకం లో వానలేక పంటలు పండక కరువుతో బాధ పడుతూఉన్నారని,తాగుటకు నీరు, లేక చావుబ్రతుకులతో బాధపడు తున్నారని వివరింపగా వరుణిదేవుడు మానవులను ఆదుకుంటానని,వానలు సకాలంలో కురిపిస్తానని వాగ్ధానం చేసాడు.

మాతలి ఇక్కడ నాకు ఎవరూ తన కూతురు కు తగిన వాడు కనపడలేదని నారదముని కి తెలుపుగా అక్కడ నుంచి మాతలిని సరాసరి, నాగలోకానికి వెంటపెట్టకు పోయాడు.నారదముని.పోయేదారి లో వింతలు,విశేషాలూ,చూపుతూ నారదముని మాతలిని అక్కడ వున్న ముఖ్యులందరినీ పరిచయం చేశాడు.చివరకు ఇద్దరూ దానవులు నివసించే పాతాళానికి కూడా వెళ్ళారు.

ఆ పాతాశలోకం లో విశ్వకర్త స్వయంగా నిర్మించిన హిరణ్య పురంలోని బంగారం,వెండి,భవనాలు,రత్నాలూ,నీలాలు,పొదిగబడిన తలుపులో ద్వారా బంధాలూ చూసేసరికి మాతలికి చాలా ఆశ్చర్యం, కలిగింది.

” గుణకేశికి ఈడూ, జోడైనవాడు ఇక్కడ ఉన్నా యువకుల్లో వున్నాడేమో చూసుకో! “అన్నాడు. నారదుడు.

మాతలి తల ఊపుతూ “ఇక్కడ మాయా ఇళ్ళూ వాకిళ్ళు తప్ప చూడ దగినవి,కోరదగిన వినవీ మరేమీలేవు స్వామి అన్నాడు.
. .”ఐనా!ధానవులకు మా అమ్మాయి ని ఎలా యివ్వటం అన్నాడు మాతలి!

ఇక నారదుడు అక్కడ నుంచి మాతలి ని తీసుకొని పాతాళంలో ఉన్న నాగుల లోకానికి తీసుకుని పోయి “ఇక్కడ వారంతా ఐశ్వరవంతులూ,శౌర్యవంతులు లైన వాసుకీ, కర్కోటకుడు, ధనంజయుడు, తక్షకుడు,ఈ పేర్లు నీవు వినేవుంటావు? వీరంతా మహామహుడైన కశ్యపుని సంతానం, మీ అమ్మాయి కి తగినవరుడు ఇక్కడ చూడమన్నాడు.నారదముని.

మాతలి అక్కడ ఉన్నకొందరు నాగ యువ కులలో ఒకని కేసి వేలుచూపుతూ నారదా! నీవు చెప్పినట్లు అదిగో!. అక్కడ ఆ యువకులలో మన కేసి చూస్తూన్న యువకుడు మా గుణకేశి కి ఈడు” అన్నాడు.

నారదుడు గుణకేశి అదృష్టవంతురాలోయి! ఆ యువకుని పేరు “సుముఖుడు”అతడు వాసుకుడికి, ఆర్యకుడికి కూడా మనవడు.”అతని తండ్రి నాగచికురుడు” పాపం!ఈ మధ్య నే గరుత్మంతుడు ని రూపంలో ఉన్న గండభేరుండపక్షి చేతిలో హతురయ్యడు”అని చెప్పాడు నారదుడు.

సుముఖుడికి తన కుమార్తె ను నివ్వటం అన్ని విధాలా మంచి దని పంచింది. మాతలికి ఆ సంబంధం కుదర్చవలసిందిగా నారదున్ని కోరాడు.

నారదుడు వెంటనే సుముఖుడి తాతగారైని ఆర్యకుడి దగ్గర కు చేరి మాతలిని ఇంద్రుని రథసారథి అని పరిచయంచేసి అతిథి మర్యాదలు కుశల ప్రశ్నలు అయిన తరువాత నారదడే ఆర్యకుడితో” మాతలి కి ఒక్కతే కూతురు మీ మనవడైన సుముఖుని కి ఇచ్చి వివాహం చేయాలని సంకల్పం”అన్నాడు.

నారదుడు మాటలు విన్న ఆర్యకుడకి ఆనందం కలగలేదు కదా! విచారంగా, ఇలా అన్నాడు. దేవతల ప్రభువు అయిన ఇంద్రుడి సారథి కుమార్తె తన మనుమడికి చేసుకోవడం కన్న ఆర్యకులు కోరదగింది ఏ మున్నది? నారద మునీంద్రా! కానీ అతడు విచారంగా ఇలా అన్నాడు.

“.మాతలి కుమార్తె మా మనుమడికి వివాహం చేసుకునేటంత గొప్ప అదృష్టం కలుగుతుందని నేనేన్నాడూ తలచలేదు సుమా!

కానీ “మేమంతా చాలా విషాదపరిస్థితులలో ఉన్నాము స్వామి”!అప్పుడు మాతలి మీ విచారాణికి తగిన కారణం ఏమనగా? ఆర్యకుడు ఇలా అన్నాడు! “సుముఖుని తండ్రి ని చంపిన “గండభేరుండపక్షి”అయిన గరుడు తిరిగి ఒక మండలము గడువక ముందే సుముఖున్ని చంపి భక్షిస్తానని శపథం చేశాడు.ఆ పక్షిరాజు శపథానికి తిరుగులేదు గదా”! అందలకే మేము సంకోచిస్తున్నాము. స్వామి అన్నాడు దిగులు మొహంతో.

ఆర్యకుడు ఇలాచెప్పగానే నారదుడు సెలవు తీసుకుని దేవలోకం చేరి దేవేంద్రుడు వద్దకు పోయారు.
నారదుడు మాతలి కుమార్తె వివాహం, సుముఖుని వృత్తాంతం,గురుడు రూపం అయిన “గండభేరుండపక్షి” పగ”అంతా వివరించారు.
ఇంకా దేవేంద్రా! సుముఖుడికి అమృతం ఇచ్చావంటే అతడు చిరంజీవి అవుతాడు. అన్ని చిక్కులూ తోలిగిపొతాయి అని సలహా చెప్పాడు. నారదుడు!దానికి ఇంద్రుడు మాత్రం సుముఖుడికి అమృతం ఇచ్చేందుకు సమ్మతించలేదు.

ఇంద్రుడు ఇలా అలోచించాడు ఆదివిష్ణువు వాహనం అయిన పక్షిరాజు శక్తి సామర్ధ్యం తెలియనివి కావు.అని నారదుని మనం అందరం కలసి మహా విష్ణమూర్తి ని వైకుంఠము కు పోయి కలవడం మే తక్షణ కర్తవ్యం అని దేవేంద్రుడు పరివారంతో కలసి నారదుని, మాతలి తో కలసి శ్రీ మహావిష్ణువు ని వైకుంఠం లో కలవగా.

మహావిష్ణువుఇంద్రా నీవు “దేవతలకు అధిపతి కదా! ఎవరికైనా నీవు పూర్ణాయుర్దాయం ప్రసాదిస్తే కాదనగల వాడెవడు? అన్నాడు విష్ణుమూర్తి.

మహావిష్ణువు మాటల్లో ధర్మసూక్షమాన్ని గ్రహించిన ఇంద్రుడు సుముఖుడి పిలిపించి “చిరంజీవి అగుదువుగాక అని దీవించి. పంపగా మాతలి బ్రాహ్మనందభరితుడై తన కుమార్తె అయిన గుణకేశి తో సుముఖుడి వివాహం అన్ని లోకాలకు తెలిసేలా అతివైభవంగా పెళ్లి జరిపించాడు.

మహావిష్ణువు అండ ఉన్నా సుముఖుడి ని గరుడ రూపం లో ఉన్న “గండభేరుండపక్షి” అనుకున్న గడువు లోపు సుముఖుడిని భక్షించలేదని పగతో,రగిలిపోసాగింది.
“గండభేరుండపక్షి”

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!