సరస్వతి – విజయం

సరస్వతి – విజయం

రచన : కార్తిక్ నేతి

పచ్చని పైర్లతో, పొడవాటి చేట్లలతో స్వచ్చమైన గాలితో కాలుష్యానికి లేని చోటు నవ్వుతు పలకరించే పల్లెటూరు, రెక్కాడితే గాని డొక్కు నిండని బ్రతుకులు ,కూలి చేసుకుంటూ జీవనం సాగించే
కలమ్మ , ఐలయ్యల కూతురు సరస్వతి కంటికి వెలుగు ఇబ్బందులేవి దరి చేరనిచ్చేవారు కాదు.
అక్కడే పాఠశాలలో తన చదువును మొదలుపెట్టింది ఎంతో తెలివైన విద్యార్దిని స్కూల్ అయిపోగానే ఇంటికి రావడం ఇంట్లోనీ పనులు చూసుకోవడం. కరెంటు కోతల్లోను , క్యాండిల్ వేలుగులో చదువుకోవడం తన రోజువారి జీవితం. ఇది ఇది గమనించిన ఐలయ్య తనకి మెరుగైన చాదువునందించాలి , పక్కూరి ప్రభుత్వ హాస్టల్లో చేర్పించారు , సైకిల్ పై వెళ్లి వస్తు ప్రకృతిని ఆస్వాదిస్తూడేది దారిలో ఎదురైనా తన తోటి పిలల్లు చూస్తున్నా ప్రతి సారి తననీ తాను ప్రేరేపించుకునేది ఒకింత కసిని పెంచుకునేది, తన కలని ఏమాత్రం మరిచిపోకుండా చదివి మెరుగైన ప్రతిభ కనబర్చి పదవ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాసాయిది.
తల్లి కలమ్మ వారి పరిస్థుతులను వవరించి పై చదువులు మా వాళ్ళ కాదంటూ చెప్పడంతో ఒక్కసారిగా గుండెలో రాయి పడినట్టయిది తన కలలు , ఆశలు ఆవిరై చదువుకు బ్రేకులు పడతాయేమో అని బాధపడుతున్న తరుణంలో గురువుల సూచనతో పై చదువులకు ఉచిత కోచింగ్ ఇచ్చే ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలుసుకున్న సరస్వతికి ఒక్కసారిగా తన కలకి ప్రాణం పోసినట్టయింది . సన్నద్దమయేందుకు చరవాణి అవసరమైంది తన స్నేహితుల ఇంటికి వెళ్లి ప్రేపేరయ్యింది ప్రవేశ పరీక్షలో ఉత్తిర్నురాలయంది అనుకున్నది సాదించింది.
తన విజయ పరంపర మొదలైంది. ఎందరికో అందని ద్రాక్ష అయిన ఐ ఐ టి సిటు సాదించింది ఆ క్షణం తన తల్లి తండ్రుల కళ్ళల్లో వర్ణించలేని సంతోషం. ఇక్కడి నుండి మొదలైయింది మళ్ళి గడ్డు పరిస్థితి ఐ.ఐ.టి చదివేందుకు లక్షల రూపాయలు కావలనే విషయం తెలియగానే కంగారుపడింది.
దాతల సాయంతో ఐ ఇట్ ఇయన్ “IIT YAN”అయింది తనల కలను నిజం చేసుకుంది. అందనంత ఎత్తుకు ఎదిగినా , తను పడిన కష్టాన్ని , మరిచిపోలేదు తన లాగే పేదరికంతో ఉన్నా ఏ ఒక్కరు చదువు ఆగిపోకోడదని “విజయం” వేదిక ద్వార విద్యదాతై ఎందరో సరస్వతులకు అండగా నిలబడింది మట్టిలోని మాణిక్యాలను వేలికితిసింది.
తన ఘనత ప్రభుత్వానికి వినపడింది తను చేసిన అత్యత్తమ సేవకు సత్కారా సభను ఏర్పాటు చేసింది. విజయం వేదిక ఏర్పాటు చేసి ఎందరికో చదువు చెప్పించి సమాజానికి తన వంతు కృషి చేసిన తనకి రావల్సినా ప్రశంస పత్రాన్ని తల్లి తండ్రులకు అందిచింది. అడాదానికి చదువెందుకన్న మనుషులలో వేరు నన్ను కన్నవారంటు
“ఎన్ని బాధలున్నా గుండెల్లో పెట్టుకొని సూర్యుడిలా వేలుగిస్తూ ముందుకు నడపించారు
నా కలకు విలువనిచ్చారు , పడిపోతున్నా ప్రతిసారి నాలో దైర్యాన్ని నింపారు
మహారాణి ల చూసుకున్నారు ఈ కూలిలే నా తల్లి తండ్రులు “కనిపించే దేవుళ్ళు” అంటు తన కృతజ్ఞతలు తెలిపింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!